వనపర్తి,సెప్టెంబర్,08 (ప్రజాతంత్ర విలేకరి) : వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని అమ్మాయిపల్లి గ్రామానికి చెందిన మండ్ల వసంత వీపనగండ్ల మండలం కల్వరాలకు చెందిన ఆర్‌ఎంపి చటమోని శాంతయ్య, వీపనగండ్లకు చెందిన డ్రైవర్ అశోక్ రెడ్డి లు కలిసి శాంతయ్యకు ఎస్సై ఉద్యోగం వచ్చినట్లు ఉద్యగం వసంత ఇప్పించారని మీకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువతను నమ్మించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మహిళాతో పాటు ఇద్దరు వ్యక్తులు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారు. దాదాపు ఆరేండ్లుగా ఈ వ్యవహారం సాగుతుండగా అనుమానం వచ్చిన కొంతమంది పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది.
వనపర్తి జిల్లా వీపనగండ్ల పెబ్బేరు మండల పరిధిలోని 36 మంది యువకులను నమ్మించి 1.62కోట్లు వసూలు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెబ్బేరై ఎస్సై రాఘవేందర్‌రెడ్డి వీపనగండ్ల ఎస్సై వహీద్ ఆలీ బేగ్ కేసు నమోదు చేసి విచారించగ వసంత రైల్వేశాఖలో టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నానని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తెలింది. నిందుల నుండి 6లక్షల నగదు, 6తులాల బంగారం ఒక ల్యాప్‌ట్యాప్ బొల్లోర కారును 20లక్షల విలువగల ఆస్తులు స్వాధీనం చేసుకొని మంగళవారం రోజు రిమాండుకు తరలిస్తున్నమని డిఎస్పీ కిరణ్‌కుమార్ తెలిపారు. నిందితుడు చెడు వ్యసనాలకు బానిసై అలవటా పడ్డారని చెప్పారు. దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. సీఐ మల్లికార్జున రెడ్డి ఎస్సై లు కానిస్టేబుళ్లను డిఎస్పీ అభినందించారు.