Take a fresh look at your lifestyle.

వోటు విలువ తెలుసుకో!

వోట్లకోసం
తొడల చరుచుకుంటున్న
రాజకీయం
వోటనే ఆయుధం విలువ
నేడు పదిలక్షలయింది
వెలివాడల్లో నాయకులంతా
నడకసాగిస్తున్నరు
కంచాల్లో తింటూ నిద్రహారాలతో తెగ పోటీ
ఉద్దరణేదిక్కడ?
సమాన్యాయమెక్కడ?

ఎన్నేళ్ళు గడిచిన ఉత్తుత్తి మాటలేగ
గాలిమేడలవి
పగటికలలవి
నమ్మావంటే(నమ్మకేంచేస్తావ్‌)
‌వారంతా ఓడ మల్లన్నలు
వోటేశాక
వోడించడమెరుకున్నోళ్ళు
ఊరవతలే బతుకలెపుడు
ఊతమెవ్వరీయరు
ఆశపడ్డావో అక్కడే
కళ్ళు తెరిచావో
మరో చరితకు నాందివవుతావోయ్‌!

‌తోడలే కాదు
మెడలు కోసుకునే గతంమరువకు
ఎక్కడ తగ్గడలో తెలుసోళ్ళకు
ఎలా నెగ్గాలో అపుడే తెలుసు
మునగచెట్లెక్కిస్తరు
మూలకిసిరికొడతరు

రాజ్యాంగమిచ్చిన హక్కును
మందుసీసలకు
బిర్యానీ ముక్కలకు కాలరాయకు!
నీ ప్రగతికి నువ్వే పిండం పెట్టకు!!
కాలచక్రాన్ని మార్చే మహా మంత్రదండమది!!!

అధికారమెవరికో ఇచ్చి
ఆధాపడడమెందు?
అందలాలను కూల్చే వజ్రాయుధమదేనోయ్‌
ఆలోచనతో అడుగేస్తే భవిష్యత్తు మారునోయ్‌

‌చాలు వోటును అమ్ముకోకు
మేలు చేయునది నమ్ముకో
ఎప్పుడూ పాదాలకాడుండుడేంది?
సమసమాజమిక్కడెప్పడికి
సాధ్యంకాదన్నదే సత్యం?!
బహుజనులందరేకంకావాలి
భవిష్యత్తు భావి భారతం నిర్మించాలి!

– సి. శేఖర్‌(‌సియస్సార్‌),
‌పాలమూరు, 9010480557.

Leave a Reply