Take a fresh look at your lifestyle.

ఘనంగా వాజ్‌పేయి జన్మదిన వేడుకలు

దేశ ప్రధానిగా అటల్‌ ‌బిహారీ వాజుపేయి మచ్చలేని పరిపాలనను ప్రజలకు అందించారని భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా ఉపాద్యాక్షులు సిరికోండ బలరాం అన్నారు. బుధవారం అటల్‌ ‌బిహరీ వాజుపేయి జన్మదినాన్ని పురస్కరించు కోని ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా అసుపత్రిలో ఆ పార్టీ మండల అద్యక్షులు గాదం కుమార్‌ అద్వర్యంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ అప్పయ్య చేతుల మీదుగా రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా బల రాం మాట్లాడుతూ వాజుపేయి పరిపాలన వలన ఈ రోజు సుపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. దేశ అభివృద్దిలో బాగమైన హైవేలు,స్వర్ణ చతుర్భుజీ ఆయన కృషికి అద్దం పడుతున్నాయన్నారు.

భారతీయ జనతా పార్టీ తరుపున ఆయన రెండు సార్లు ప్రధాన మంత్రి పదవిని చేపట్టారన్నారు. అలుపెరుగని రాజకీయ నాయకులుగా 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు తీసుకున్నారన్నారు.ఆయన పుట్టిన రోజు ఆయిన డిసెంబర్‌ 25‌ను సుపరి పాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోత్త దశరధం,జిల్లా కార్యదర్శి సూర్యదేవర విశ్వనాధ్‌,‌జిల్లా నాయకులు భూక్య జవహర్‌, ‌జినుకల కృష్ణాకర్‌రావు,రాయంచు నాగరాజు, యాద సంసత్‌, ‌రవీంద్రాచారి, అనిల్‌రెడ్డి,రవిరెడ్డి, ఎల్కతుర్తి శ్రీహరి, గంగిశెట్టి రాజు, రాకేష్‌, ‌సురేందర్‌,‌కట్టయ్యలు పాల్గోన్నారు.

Tags: Vajpayee’s, Birthday, Celebrations, sirikonda balaram

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy