Take a fresh look at your lifestyle.

వైవస్వత మన్వంతర సప్త మహర్షులు

హిందూ విశ్వ ఆవిర్భావ సిద్ధాంతం ప్రకారం ఒక ‘మను’ పాలనాకాలాన్ని మన్వంతరమని (మను ం అంతరం మనువు కాలం), ఒక్కో మన్వంతరం 30-85 కోట్ల సంవత్సరాలని పెద్దలు ప్రవచించారు . 894 కోట్ల సంవత్సరాల ఒక బ్రహ్మ దినంలో 14 మన్వంతరాలు (స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సూర్య సావర్ణిక, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, భద్రసావర్ణి, దేవసావర్ణి మరియు ఇంద్రసావర్ణి) కాలచక్రంగా మారుతాయట, ప్రతి మన్వంతరంలో సప్తరుషులు, ఇంద్రుడు, సురులు మారుతూ ఉంటారని చెబుతారు.

ప్రస్తుతం 7వ వైవస్వత మన్వంతరం నడుస్తున్నదని, దీనికి అధిపతి ‘వైవస్వత మనువు’ అని పురాణ కథనం మేర హిందువుల విశ్వాసం. వైవస్వత మన్వంతరంలోని 71 యుగాలలో 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల అనంతరం కలియుగం నడుస్తున్నది. ప్రస్తుత వైవస్వత మన్వంతరంలో పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు, శ్రీ కృష్ణ, బుద్ధ అవతారాలు పూర్తయి, కల్కి అవతరించనున్నారు. ‘మనువు’ లోనుంచి ‘మానవుడు‘ అనే పదం ఉద్భవించిందట. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలోని మహర్షులలో కశ్యపుడు, అత్రి, వశిష్టుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని భరద్వాజుడు ఉన్నారు. వీరే సప్తరుషులు. ఈ మహార్షుల గురించి కొంత తెలుసుకుందాం :

1. కశ్యప మహర్షి:
వైవస్వత మన్వంతర సప్తరుషుల్లో అతి పురాతన రుషి కశ్యపుడు ఒకరని రుగ్వేదం చెబుతున్నది. కాల-మరీచి పుత్రుడైన కశ్యపుడు రుగ్వేదంలో అనేక శ్లోకాలు రచించాడని విశ్వసిస్తారు. కశ్యపుడి ప్రస్థావన పతంజలి భాష్య శ్లోకాలలో కూడా ఉంది. ఇతిహాస, వేద పురాణాలలో కశ్యపుడి ప్రస్తావన కనిపిస్తుంది. రామాయణ, మహాభారత, విష్ణు పురాణాలలో కశ్యపుడి పాత్ర కనిపిస్తుంది. కశ్యప సంహిత ఆయుర్వేద, కశ్యప జ్ఞానకాండ, కశ్యప ధర్మసూత్ర, కశ్యప సంగీత కశ్యప శిల్ప వంటి గ్రంథాలు రచించారు. ప్రజాపతి దక్షుడి 13 మంది కుమార్తెలను కశ్యపుడు వివాహం చేసుకుంటాడు. కశ్యపుడి భార్య ‘దితి’కి హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు జన్మించారు. హిమాలయాలలోని హిందూ లోయలను కశ్యపుడి పేరిట పిలుస్తారు. ‘కశ్యపమిర’ పదంలోంచే ‘కశ్మీర్‌’ ‌వచ్చిందని అంటారు.

2. అత్రి మహర్షి:
వైవస్వత మన్వంతరంలోని సప్తరుషుల్లో అత్రిని ఒకరుగా రుగ్వేదంలో వర్ణించారు. బ్రహ్మ పుత్రుడైన అత్రి అనసూయ దేవిని వివాహం చేసుకున్నారు. రుగ్వేదంలోని 5వ మండలాన్ని ‘అత్రి మండలం’గా పిలుస్తారు. అత్రి ప్రస్తావన ఇతిహాసాలు, పురాణాలలో కూడా ఉంది. అత్రి భక్తికి మెచ్చిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమై కోరికలను తీర్చారు. మరో కథానుసారం పతివ్రత అనసూయ దేవికి త్రిమూర్తులు బ్రహ్మ చంద్రగా, విష్ణు దత్తాత్రేయగా, శివుడు దుర్వాసుడిగా జన్మించారని అంటారు.

3. వశిష్ట మహర్షి:
రుగ్వేదంలోని 7వ మండలాన్ని వశిష్టుడు రచించారు. ఆది శంకరాచార్య హిందూ తత్వసిద్ధాంతం ప్రకారం వశిష్టుని వేదాంతం ప్రధానమైనదని గుర్తింపుపొందింది. అరుందతిని వివాహం చేసుకున్న వశిష్టుని తల్లితండ్రులు మిత్రవరుణ- ఊర్వశిగా వేదాలు చెబుతున్నాయి. అగ్ని, విష్ణు పురాణాలను రచించిన వశిష్టుడి ఆధీనంలో కామధేను, నందిని ఉండేవని పేర్కొంటారు. శ్రీ రాముడి గురువుగా రఘువంశ పూజ్యునిగా వశిష్టుడు ఖ్యాతి గడించారు. ఈయన వశిష్ట సంహిత, ధర్మసూత్ర, యోగ వశిష్ట, అగ్ని పురాణ, విష్ణు పురాణ గ్రంథాలను రచించారు.

Vaivasvata Manvantara Sapta Maharshis

4. విశ్వామిత్ర మహర్షి:
గాయత్రి మంత్రంతో పాటు రుగ్వేదంలో 3 మండలాలు రచించిన విశ్వామిత్రుడు పురాణ ఆది పురుషునిగా ప్రసిద్ధిగాంచాడు. రాజర్షిగా పేరుగాంచిన విశ్వామిత్రుడి వివరణ వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది కౌశిక రాజుగా అమవాసు రాజవంశానికి చెందిన విశ్వామిత్రుడు కుశ రాజు మునిమనుమడిగా ‘విష్ణు పురాణం’ , ‘హరివంశ’లో పేర్కొన్నారు. త్రిశంకు స్వర్గ సృష్టికర్తగా విశ్వామిత్రుడు ప్రసిద్ధి. రామాయణంలో రాముడికి దేవాస్త్ర జ్ఞానం బోధించి, రాముని అస్త్రంగా చేసుకొని తాటక, మారీచ సుబాహు రాక్షసులను వధించాడు. సీత స్వయంవరానికి శ్రీ రాముడిని తీసుకెళ్లి సీతారామకళ్యాణ కారకుడైనాడు కౌశిక గోత్రం కలిగిన మహర్షి విశ్వామిత్రుడు.

5. గౌతమ మహర్షి:
గౌతమ మహర్షి ప్రస్థావన జైనిజమ్‌, ‌బుద్ధిజమ్‌, ‌రామాయణాలలో ఉంది. భార్య అహల్యకు ఇంద్రునితో సంబంధం కారణంగా శాపం ఇచ్చారని కథనం.. గోదావరి లేదా గౌతమి నది సృష్టి కర్తగా కూడా ఈయన ప్రసిద్ధి. వామదేవ కుటుంబ వ్యవస్థాపకునిగా, గౌతమ తండ్రికి పుత్రునిగా, రుగ్వేదం 4వ మండల శ్లోక రచయితగా ప్రఖ్యాతి. వామన పురాణం ప్రకారం ఈయనకు జయ, జయంతి, అపరాజిత అనే ముగ్గురు కుమార్తెలున్నారు.. మహాభారతం ప్రకారం శరద్వన్‌, ‌సిరాకారి అని ఇరువురు కుమారులు కూడా ఉన్నారు. వాల్మీకి రామాయణం ప్రకారం ఈయన అహల్యకు శతనంద కుమారుడు జన్మించాడు. అంగీరస వంశానికి చెందిన రాహుగణుడి కుమారుడైన గౌతముడికి అతని కుమారురైన వామదేవుడు, నోధసుడికి మంత్రాల సృష్టికర్తలుగా పేరుంది.

6. జమదగ్ని మహర్షి:
బ్నుచీకుని కుమారుడైన జమదగ్ని రేణుకాదేవిని వివాహమాడారు. భృగు మహర్షి వంశానికి చెందిన జమదగ్ని రేణుకాదేవి చిన్న కొడుకు పరశురాముడు. భృగునికి కోపం బహు ఎక్కువ. నీరు తేవడం ఆలస్యమైందనే కారణంగా భార్య రేణుకను సంహరించమని కొడుకులను ఆదేశించగీ, తండ్రి మాటను పరశురాముడు శిరసావహించి తల్లిని సంహరిస్తాడు. మాట విన్నందుకు సంతోషించిన తండ్రి జమదగ్ని ఇచ్చిన వరంతో తల్లి, సోదరులకు పరశురాముడు ప్రాణాలు పోస్తాడు. కార్తవీర్యార్జునుడితో వైరం, కార్తవీర్యార్జునుడి కుమారులు జమదగ్నిని వధించడం, పరశురాముడు తండ్రిని బతికించుకోవడం వంటి విషయాలుజమదగ్ని జన్మవృత్తాంతంలో తెలుస్తాయి

7. భరద్వాజ మహర్షి:
భరద్వాజ అనే సంస్కృతం పదం ‘భార(ద్‌?)’, ‘‌వాజ్‌(‌మ్‌)’‌ల కలయిక వల్ల ఉద్భవించింది. పురాణాలలో అత్రి మహర్షి కుమారినిగా పేర్కొన్న భరద్వాజుని అసలు పేరు ‘భరద్వాజ బార్హస్పత్య’గా చెబుతారు. ఈయన ఇంద్రుని వద్ద వైద్యశాస్త్రం అభ్యసించాడు. సుశీలను వివాహమాడి గర్గ నామధేయ కుమారుని, దేవవర్ణిణి కుమార్తెకు జన్మనిస్తారు. భరద్వాజు ప్రశాంతత, పవిత్రత కలిగిన సప్త మహర్షులలో ఒకరుగా ఖ్యాతి గడించారు. భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని ‘భారద్వజతీర్థ’ అని అంటారు. వేద, ఇతిహాస పురాణ పురుషులుగా నేటి సమాజానికి కూడా దిశానిర్దేశం చేస్తూ, విలువలుగల హిందూ కుటుంబాలకు దీపస్తంభాలుగా నిలువెత్తు రూపాలుగా వైవస్వత మన్వంతర మహా సప్తర్షులు భగవంతుని ప్రతిరూపాలుగా మన గలుగుతున్నారు.

Dr. Burra Madhusudan Reddy Recipient of the National Best Faculty Award, Retired Principals, Government Degree PG, College Karimnagar
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత , విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ, కళాశాల
కరీంనగర్‌ – 99497 00037

Leave a Reply