Take a fresh look at your lifestyle.

త్వరగా వైశ్య సదన్‌ను వినియోగంలోకి తీసుకురావాలె…: మంత్రి హరీష్‌రావు సూచన

సిద్ధిపేట పురపాలక సంఘం పరిధిలో జి ప్లస్‌ ‌వన్‌ ‌విధానంలో నిర్మాణంలో ఉన్న వైశ్య సదన్‌ను వచ్చే నాలుగు నెలల్లో వినియోగం తీసుకుని రావాలని సంబంధితులకు మంత్రి హరీష్‌రావు సూచించారు. గురువారం సిద్ధిపేటలో నిర్మాణంలో ఉన్న వైశ్య సదన్‌ ‌పనులను మంత్రి హరీష్‌రావు పలిశీలించారు. ఇప్పటికే రూ.2.6 కోట్లతో ఈ సదన్‌ ‌నిర్మాణం చేపట్టగా, ఆ నిధులు సరిపోక పోవడంతో మరో 2 కోట్ల రూపాయల నిధులు మంత్రి మంజూరు చేశారు.

వైశ్య సదన్‌ ‌ప్రధాన పనులు ఇప్పటికే పూర్తి కాగా పెండింగ్‌ ‌పనులైన ఆర్చ్, ‌గేట్‌, ‌ప్రహారీ, ఫాల్స్ ‌సీలింగ్‌ ‌తదితర అన్ని పనులు పూర్తి చేసి… సాధ్యమైనంత త్వరగా వినియోగంలోకి తీసుకుని రావాలన్నారు. ఇంకా అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తానని మంత్రి తెలిపారు. మంత్రి వెంట మునిసిపల్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌మంజుల, సుడా ఛైర్మన్‌ ‌మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, సుడా డైరెక్టర్‌ ‌మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, వైశ్య ప్రతినిధులు కొమురవెల్లి అంజయ్య, తోట అశోక్‌ ‌తదితరులు ఉన్నారు.

Leave a Reply