Take a fresh look at your lifestyle.

వరద ప్రాంతాల్లో వైకాపా నేతల పర్యటన గత ప్రభుత్వ పాపాలే అన్న అవినాశ్‌

 

విజయవాడ, సెప్టెంబర్‌ 29 : ‌గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పర్యటించారు. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అధికారులతో సక్ష సమావేశమయ్యారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు నిత్యం ప్రజల మద్యే ఉంటు న్నామన్నారు. నష్టపోయిన ఏ ఒక్క రైతుకు ఇబ్బంది రానివ్వమన్నారు. ప్రతి బాధితుడికి నష్టపరిహారం అందజేస్తామన్నారు. గత వరద సాయం ఆలస్యమైన మాట వాస్తవమేనని మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఇదిలావుంటే గత ప్రభుత్వం కట్టిన రిటైనింగ్‌ ‌వాల్‌ ‌నిరుపయోగంగా మారిందని, నిర్మాణం నాసిరకంగా కట్టడం వల్ల ఈ రోజు వాల్‌ ఉన్నా నీళ్లు లోపలకు వస్తున్నాయని వెఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ‌దేవినేని అవినాష్‌ ‌మండిపడ్డారు.
భారీ వర్షాలు, వరదలకు విజయవాడలో నీటమునిగిన కృష్ణలంక ప్రాంతాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. కృష్ణా కరకట్ట ప్రాంతంలో నీటి మునిగిన 15వ డివిజన్‌లో పర్యటించిన దేవినేని డియోతో మాట్లాడారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ప్రకాశం బ్యారేజ్‌కి వచ్చి చేరుతుందని, బ్యారేజ్‌ ‌నుంచి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారని తెలిపారు. క్రమంగా వస్తున్న వరద ప్రవాహం తగ్గు ముఖం పడుతుందని పేర్కొ న్నారు. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. గత పాలకులు నిర్లక్ష్యంతో రిటైనింగ్‌ ‌వాల్‌ ‌నిర్మాణం సగంలో ఆపేశారని తెలిపారు. రిటైనింగ్‌ ‌వాల్‌ ‌నిర్మాణం సగంలో ఆపడం కారణంగానే ప్రస్తుతం ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. స్థానిక ఎమ్యెల్యే మాటలు తప్ప ఎక్కడ చేతలు కనబడవని, రిటైనింగ్‌ ‌వాల్‌ ‌నిర్మాణం కచ్చితంగా ప్రభుత్వం చేసి తీరుతుందని తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి వాల్‌ ‌నిర్మాణానికి డబ్బులు కేటాయించారని గుర్తు చేశారు. త్వరలోనే వాల్‌ ‌నిర్మాణం పూర్తి చేసి ప్రజలను వరద కష్టాల నుంచి తప్పిస్తామని తెలిపారు. సహయక చర్యల్లో కార్యకర్తలు అందరూ ప్రజలకు తోడు ఉండాలని దేవినేని కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply