“ప్రాన్స్ దేశంలో ఫ్రెంచ్ మాట్లాడేవారి కన్నా అధికంగా ఉంటుంది కాంగో జనాభా. కాంగో కిన్షాసాలలో కొంత పేదరికం ఉంది. బానిసల అమ్మకం, కొనుగోలు జరిగే యుగంలో అట్లాంటిక్ యూరోప్ దేశాల ఆసాములు ఈ తెగ ప్రజలను బానిసలుగా అమ్ముకునే వారు. చాలా మంది సంగీతకారులు వీరి సంగీతాన్ని కాపీ కొట్టి స్టార్స్ అవుతుంటారు. ప్రకృతిని పరిరక్షించే పనిలో ఈ ప్రజలు ఎన్నో త్యాగాలు గతంలో చేసారు. ఆఫ్రికాలోని ఈ కాంగో ప్రజలపై కొరోనా వైరస్ వాక్సిన్ తయారు చేస్తున్న దేశాల డేగ కన్ను పడింది.”

మహా అభివృద్ధి చెందిన దేశాలు కొరోనా వైరస్ వాక్సిన్ కనుగొనడానికి సిద్ధం అవుతున్నాయి. కొరోనా వైరస్ బారిన పడకుండా ఉపయోగించే వాక్సిన్ తయారు చేయడంలో ముఖ్య ఘట్టం ‘‘కొరోనా వాక్సిన్ టెస్టింగ్..’’ కొరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇమ్యూన్ డెవలప్ చేసే ఇమ్యూన్ డెవలపింగ్ బూస్టర్స్ ఉంటాయి. ఈ వాక్సిన్ కొరోనా సోకినా వ్యక్తిపై పనిచేయదు అని చెబుతున్నారు. కొరోనా వస్తే తట్టుకునే శక్తి శరీరానికి ఇచ్చే వ్యాక్సిన్ అని చెబుతున్నారు. అంచేత టెస్టింగ్ ఎలా ఉంటుందంటే ముందు ఆరోగ్యవంతమైన వ్యక్తికి వాక్సిన్ ఇస్తారు. అటుపై ఆ వ్యక్తికి కొరోనా వైరస్ సోకేలా చేస్తారు. సదరు టెస్టింగ్‌లో పాల్గొన్న వ్యక్తి తట్టుకుని నిలబడతారో.. లేదో.. గమనిస్తారు. అంటే ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి కొరోనా వ్యాక్సిన్ షాట్స్ తీసుకుని కొరోనాని ఎదుర్కొంటానికి సిద్ధం చేసే వ్యాక్సిన్ తయారు చేస్తున్న సో కాల్డ్ డేవలప్..సివిలైజ్డ్ అమెరికా, కెనడా, చైనా తమ దేశ పౌరులను టెస్టింగ్‌కి వాడటం లేదు. మరి టెస్టింగ్‌కి ఏ దేశపౌరులను వాడుతున్నారో తెలుసా..? రిపబ్లిక్ అఫ్ కాంగో.. ప్రపంచ దేశాలలో 185వ దేశంగా ది రిపబ్లిక్ కాంగోని గుర్తించారు. సహజసిద్ధమైన వనరులు ఈ దేశం సొంతం. అమెజాన్ అడవుల తర్వాత అంత ప్రసిద్ధి పొందిన అడవులు కాంగోలో ఉన్నాయి. ఇక్కడ అనేకానేక వన్యప్రాణులు జీవిస్తున్నాయి. ఈ దేశాన్ని భౌగోళికంగా ఐదు భాగాలుగా విభజించవచ్చు.
కాంగో బేసిన్, కీవు, కసాయి, కటనగా రీజన్స్, వెస్ట్రన్ రీజన్. కాంగో బేసిన్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. అమెజాన్ ఫారెస్ట్ తర్వాత అత్యధిక వర్షం పడేది ఇక్కడే. అలాగే ఇక్కడ ఉరుములు, మెరుపులు కూడా చాలా ఎక్కువ. ప్రపంచంలోనే అత్యధిక ఉరుములు, మెరుపులు నమోదు అయ్యే ప్రాంతం ఇది. ఈ ప్రాంతం వైల్డ్ లైఫ్‌కి పుట్టినిల్లుగా ఉంటుంది. వెస్ట్రన్ రీజన్ వ్యవసాయ భూములతో, అడవులతో, నదీ ప్రవాహంతో, పచ్చదనంతో నిండి వుండే ప్రాంతం. వెస్ట్రన్ రీజన్ ప్రాంతంలో కాంగో జనాభా అత్యధికంగా వుంటారు. ఇక్కడ వ్యవసాయం చేసుకుని, చేపలు పట్టుకుని జీవిస్తారు. వీరి ప్రధాన ఆహారం చేపలు. అరటి ఆకు చుట్టి స్థానిక మసాలతో వండే ‘మకోబె’ అనే చేప వంటకం ఇక్కడి ప్రజలకి ఇష్టం. కీవు ప్రాంతంలో కీవు లేక్ అగ్ని పర్వతాలు ఉంటాయి. ఇక్కడే నిరాగొంగో, న్యామురిగిరా అనే నిత్యం లావా వెదజల్లే పర్వతాలు వున్నాయి. ప్రపంచంలో ఎత్తైన పర్వతం మౌంటెన్ స్టాన్లీ ఇక్కడే ఉంది. అలాగే ప్రసిద్ధికెక్కిన కిలి మంజరో పర్వతం ఇక్కడే ఉంది. ఇక చివరగా కసాయి, కటనగా ప్రాంతాలు తీసుకుంటే..కసాయిలో వజ్రాలు, కటనగాలో మినరల్స్ పుష్కలంగా వున్నాయి. కసాయి, కటనగా మైనింగ్ ప్రాంతం. 2016లో వేసిన ఓ అంచనా ప్రకారం ఈ ప్రాంతంలో 25 వేల ట్రిలియన్ విలువ చేసే మినరల్స్.. డైమండ్స్..సంపద ఈ ప్రాంత భూమి అడుగున ఉన్నాయి. అమెరికా..యూరోప్ జీడీపీలు రెండు కలిపితే ఎంత సంపదో అంత సంపద కసాయి, కటనగా భూమిలో నిక్షిప్తం అయి వుంది అని చెబుతారు. ఈ ప్రాంతం డ్రై ఏరియాగా ఉండి హుమిడిటీతో ఉంటుంది. ఈ దేశం అభివృద్ధి పేరుతో సహజ వనరుల తవ్వకాలను ఇష్టం వచ్చినట్లు చేయటం లేదు. ఇష్టానుసారం మైనింగ్ చేయకపోవడం ద్వారా ప్రకృతిని కాంగో ప్రజలు కాపాడుకుంటున్నారు. ది రిపబ్లిక్ అఫ్ కాంగో దేశ సాటిలైట్ పిక్చర్స్ చూసినప్పుడు ఆ దేశం పచ్చగా కళకళ కనిపిస్తుంది. ఈ దేశాన్ని ఇంకా అభివృద్ధి అనే మాయదారి కోరలకు చిక్కుకొని దేశంగా కూడా చెప్పవచ్చు. కాంగో దేశ వాసులు తమని తాము కాంగో కిన్షాసాల మని కాంగో ప్రజలమని రెండు రకాలుగా తమని తాము ప్రపంచానికి తెలుపుకుంటారు. కాంగో జనాభాలో కాంగో కిన్షాసా వారు అధికులు. వీరు మొత్తం జనాభాలో 80%. వీరిలో 250 రకాల ట్రైబ్స్, ఎతినిక్ గ్రూప్స్ ఉన్నాయి. వీరికి వివిధ పేర్లు వున్నాయి. వీరందరిని బంటు ప్రజలు అని కూడా అంటారు. వీరు కాకుండా నాన్ బంటు ప్రజలు 18%. వీరిని గిలిమ, మోనో, ఆడమవా.. ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. మిగిలిన 2% కాంగో ప్రజలను పిగ్మిస్ అంటారు. కాంగో ప్రజల అధికారిక భాషలు లింగాల, స్వాహిలి, టీషిలుబ, కికాంగో. అయితే అందరూ ఫ్రెంచ్ మాట్లాడతారు. ప్రాన్స్ దేశంలో ఫ్రెంచ్ మాట్లాడేవారి కన్నా అధికంగా ఉంటుంది కాంగో జనాభా. కాంగో కిన్షాసాలలో కొంత పేదరికం ఉంది. బానిసల అమ్మకం, కొనుగోలు జరిగే యుగంలో అట్లాంటిక్ యూరోప్ దేశాల ఆసాములు ఈ తెగ ప్రజలను బానిసలుగా అమ్ముకునే వారు. చాలా మంది సంగీతకారులు వీరి సంగీతాన్ని కాపీ కొట్టి స్టార్స్ అవుతుంటారు. ప్రకృతిని పరిరక్షించే పనిలో ఈ ప్రజలు గతంలో ఎన్నో త్యాగాలు చేసారు. ఆఫ్రికాలోని ఈ కాంగో ప్రజలపై కొరోనా వైరస్ వాక్సిన్ తయారు చేస్తున్న దేశాల డేగ కన్ను పడింది.
అందుకే కొరోనా వ్యాక్సిన్ తయారీ ప్రకటన తర్వాత ఫ్రెంచ్ డాక్టర్లు వివిధ న్యూస్ చానెల్స్ డిబేట్లలో కూర్చుని ది రిపబ్లిక్ అఫ్ కాంగో పేద దేశం, పైగా హ్యూమిడిటీ అధికంగా వున్నా దేశం. అక్కడి ప్రజల అభివృద్ధికి నోచుకోటం లేదు. అంచేత అక్కడే కరోనా వైరస్ వాక్సిన్ టెస్ట్ కాంగో ప్రజలపై జరిపించటం తగును అని తమ ప్రావిణ్యం మొత్తం ఒలికించి ఊదరగొడుతున్నారు. ఈరోజు మన మనసుల్లో ఉన్న బలమైన కోరిక కొరోనా మహమ్మారిని మూలాలతో సహా చంపివేసే వ్యాక్సిన్ తయారు కావాలి. అలాగే బడా బడా కార్పొరేషన్ల కోరిక అందరికంటే ముందు కరోనా వ్యాక్సిన్ కనిపెట్టి దానికి పేటెంట్ చేసుకుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అమ్ముకోవాలి. ఈ విషయంలో రెండు అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా..చైనా.. తెగ పోటీ పడుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య వ్యాపారం యథావిధిగా కొనసాగుతూనే ఉంటుంది. మరోవైపు ట్రేడ్ వార్స్ కూడా జరిగిపోతూవుంటాయి. కొరోనా వైరస్‌ను ‘వ్యూహాన్ వైరస్’ అని అమెరికా అధ్యక్షుడు పిలుస్తాడు. దానిపైన చైనా అధ్యక్షుడికి కోపం వచ్చేస్తుంది..ఆ.. ఏం కాలే.. అంతా తూచ్.. అని అమెరికా, చైనాలు ఎప్పుడంటే అప్పుడు సమావేశమైపోతారు లేదా టెలిఫోన్లో మాట్లాడేస్తుంటారు. కట్ చేస్తే..ప్రపంచం మొహాన ఒక ట్వీట్ పడేస్తారు. ‘‘చైనా అధ్యక్షుడుతో మాట్లాడాను. అంతా సవ్యంగా ఉంది’’. అని ట్రంప్.. ‘‘చైనా, అమెరికా రెండు దేశాలు కలసి కొరోనా వైరస్ మహమ్మారిపై యుద్ధం చేస్తాయి’’ అని జిన్‌పింగ్ అనేస్తారు. అటుపై అమెరికా చైనా అధ్యక్షుల ట్విట్స్ ఇలా వస్తాయి .. ‘‘ఇరు దేశాలూ కలిసి కొరోనా మహమ్మారిని కిల్ చేసే వ్యాక్సిన్ కని పెడతాం’’ వాస్తవానికి ఈ ట్వీట్లు రెండు దేశాల వ్యాపార లావాదేవీ వివరాలన్నమాట. ట్వీట్ల ఆధారంగా ప్రధాన స్రవంతి మీడియా ఇలా మనముందు వార్తా కథ•నం వడ్డిస్తుంది . ‘‘యునైటెడ్ స్టేట్స్లో కానీ, కెనడాలో కానీ, చైనాలో కానీ కొరోనా వైరస్‌ని జయించే వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి ప్రయత్నాలు మొదలు..త్వరలో వాక్సిన్ సిద్ధం కానుంది.’’ ఇంచుమించుగా ఈ వాక్సిన్ తయారీ ప్రయత్నాలు, అప్పుడే వాక్సిన్ తయారీలో భాగం అయిన దేశాలు కరోనా వైరస్‌ను జయించే వ్యాక్సిన్ పుట్టినాక.. ప్రపంచ దేశాలకు అమ్మేటప్పుడు లాభాలను ఎలా పంచుకోవాలి అన్న విషయంపై అవగాహనకి వచ్చేస్తాయి. సరే ఇంత వరకు నడిచే ఘట్టాల వలన వారికి డబ్బు మనకి రోగంకి మందు అనుకుంటే.. పప్పులో కాలేసినట్టే. కాంగో ప్రజలపై, అక్కడి సంపదపై, అక్కడి ప్రకృతిపై మాయదారి అభివృద్ధి బేహరుల కన్ను పడింది.. ది రిపబ్లిక్ అఫ్ కాంగో దేశ పౌరుడు అయిన డిడిర్ ద్రోగ్బా.. ‘‘నా దేశ ప్రజలను కాపాడే బాధ్యత ఆఫ్రికా నాయకులకు ఉంది. కానీ వారు ఆ పని చెయ్యరు. ఆ దేవుడే నా దేశ ప్రజలని కాపాడాలి’’ అని ఎలుగెత్తి నినాదం ఇచ్చినట్టు ట్వీట్ చేసాడు. డిడిర్ ద్రోగ్బా ఫుట్‌బాల్ ఆటగాడు. చెల్సియాలో ఉన్న ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ క్లబ్ ఇతనిపై పెట్టుబడి పెట్టి కొనుక్కుంటే ఇంగ్లాండ్ ఆటగాడుగా ఫుట్‌బాల్ ఆడతాడు.
ది రిపబ్లిక్ అఫ్ కాంగో జాతీయ జీవసంబంధ సంస్థ అధిపతి జీన్-జాక్వెస్ ముయెంబే ఇలా ప్రకటించారు ‘‘కొరోనా వైరస్ పరీక్షలను నిర్వహించడానికి మమ్మల్ని ఎంపిక చేసారు’’ ఫ్రెంచ్ డాక్టర్స్, ఫుట్‌బాల్ ఆటగాడు, కాంగో ప్రభుత్వ అధికారి.. ముగ్గురు మూడు ప్రకటనలు చేసారు. ఈ మూడు ప్రకటనల వలన ఎవరెవరికి ప్రయోజనం చేకూరుతుందో మనకి ఈ పాటికే అర్థం అయ్యింది.ఫ్రెంచ్ డాక్టర్స్ అభివృద్ధి చెందిన దేశాలకు అనుకూలిస్తున్నారు. ఎందుకంటే కాంగోపై ఫ్రాన్స్, బ్రెజిల్ రెంటికి కాంగో మీద ఇంట్రెస్ట్ ఉంది. అమెరికా, చైనా, ఫ్రాన్స్ దేశాల ఇంట్రెస్టులకు కొమ్ముకాసే ఆఫ్రికా నాయకత్వం ఉంది. సొంత గడ్డ మీద ఫుట్‌బాల్ టీమ్ ఏర్పాటు చేసుకునే అవకాశం లేక వేరు దేశానికీ అమ్మకానికి గురి అయిన ఫుట్‌బాల్ ఆటగాడు డిడిర్ ద్రోగ్బాకి బాధకి అండగా నిలిచేది ఎవరు ? ఏమో ఎవరికి తెలుసు తనకి మంచి ధర దొరికితే అమ్ముడు పోతాడేమో.. అమ్ముడు పోక పోతే ఖర్చయి పోతాడేమో.. ఎవరికి ఎరుక. ఇప్పుడు చెప్పండి మన పాలకులు అమెరికా చైనా తరహా అభివృద్ధి మన దేశంలో చేస్తాం.. అంటే మనం ఒకే అనొచ్చా..? ప్రకృతిని నాశనం చేసిన వారికి కొరోనా రోగం వస్తే ప్రకృతిని రక్షించేవారు మూల్యం చెల్లించాలా? అవును అనే మనమంతా అంటున్నాం..కాంగోలో కొరోనా వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జూలై లేదా ఆగస్టులో ప్రారంభమవుతాయని ది రిపబ్లిక్ అఫ్ కాంగో జాతీయ జీవసంబంధ సంస్థ అధిపతి జీన్-జాక్వెస్ ముయెంబే చెబుతున్నాడు. పాపం ప్రకృతి వడిలో ఉన్న కాంగో ప్రజలు గుర్తుంచుకోవాల్సిన విషయం మనల్ని కొరోనా వైరస్ మాత్రమే కాదు..కొరోనా వ్యాక్సిన్ కూడా మనల్ని పట్టి పీడించనున్నది..