Take a fresh look at your lifestyle.

వ్యాక్సిన్‌ ‌కొరత ఆందోళన కలిగిస్తుంది..

  • ఎగుమతిని నియంత్రించాలి  
  • దేశ పౌరులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి
  • ప్రజారోగ్యం రాష్ట్ర విషయం..
  • కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో  కాంగ్రెస్‌ అధ్యక్షురాలు  సోనియా గాంధీ వర్చువల్‌ ‌సమావేశం

‌కొరోనా వైరస్‌ ‌కేసులు దేశంలో పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ‌తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌ ‌సమావేశం నిర్వహించారు. పార్టీ సీనియర్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశ్యం దేశంలో కొరోనా కేసులు పెరుగుతున్న కాలంలో నెలకొన్న పరిస్థితిని తెలుసుకోవటం..వాక్సిన్‌ ‌లభ్యతకి సంబంధించిన సమాచారం తెలుసుకోవటం. సమావేశంలో సోనియా గాంధీ టెస్టింగ్‌, ‌ట్రాకింగ్‌, ‌వాక్సిన్‌ ‌వేయడంలకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. కొరోనా విపత్తును ఎదుర్కోవటంలో పారదర్శకత ఉండాలంటూ కాంగ్రెస్‌ ‌రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాలు కూడా వైరస్‌ ‌వ్యాప్తి, కేసుల సంఖ్య మరియు మరణాల సంఖ్యను ప్రభుత్వాలు బహిర్గతం చేయాలని సోనియా అన్నారు. మొదట భారతదేశం వాక్సిన్‌ ‌డ్రైవ్‌పై దృష్టి పెట్టాలి..ఆ తరువాతే వాక్సిన్‌ ‌డోసులను ఎగుమతి చేసి ఇతర దేశాలకు బహుమతిగా ఇవ్వాలని సోనియా అన్నారు. అన్ని రాజకీయ కార్యక్రమాలు,ఎన్నికల ర్యాలీలు,బహిరంగ సభలు రద్దు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.పౌరులకు బాధ్యతాయుతమైన ప్రవర్తనపై ప్రభుత్వాలు నొక్కి చెప్పాలని, మినహాయింపు లేకుండా అన్ని చట్టాలు మరియు కోవిడ్‌ ‌నిబంధనలకు కట్టుబడి ఉండాలని ప్రజలకి తెలపాలని సోనియా అన్నారు. వ్యాక్సిన్ల ఎగుమతిపై వ్యాఖ్యానిస్తూ దేశీయ వ్యాక్సిన్‌ అవసరాలపై దృష్టి పెట్టాలని రాహుల్‌ ‌గాంధీ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్‌ ‌నిర్వహణ విషయమై కేంద్రాన్ని తప్పుపడుతూ మోడీ ప్రభుత్వం పరిస్థితిని అద్వాన్నంగా నిర్వహించిందని అన్నారు. మోడీ సర్కార్‌ ‌వ్యాక్సిన్‌ ఎగుమతి చేసి భారతదేశంలో కొరత సృష్టించడానికి కారణం అయ్యిందని రాహుల్‌ అన్నారు. కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురించి మాట్లాడుతూ, ఎన్నికలు మరియు మతపరమైన కార్యక్రమాలు సామూహిక సమావేశాలు కోవిద్‌ను  వేగవంతం చేశాయని, ఈ పరిస్థితికి అందరూ భాధ్యులమేనని ఆయన అన్నారు. దేశ ప్రయోజనాలను రాజకీయం కన్నా పైన ఉంచాలని అన్నారు.  మహారాష్ట్ర, ఒడిశా, ఆంధప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌రాజస్థాన్‌, ‌యుపి, ఉత్తరాఖండ్‌, ‌ఛత్తీస్‌ఘర్‌, ‌బీహార్‌తో సహా పలు రాష్ట్రాలు వ్యాక్సిన్‌ ‌కొరతను ఎదుర్కొంటున్నాయి. వాక్సిన్‌ ‌లభ్యత, మందులు, వెంటిలేటర్లతో సహా కోవిడ్‌ -19‌తో పోరాడటానికి కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రయత్నాలను సోనియా గాంధీ సమీక్షించారని కాంగ్రెస్‌ ‌ప్రతినిధి రణదీప్‌ ‌సుర్జేవాలా తెలిపారు.
వాక్సిన్‌ ‌డోసుల ఎగుమతిపై తక్షణ తాత్కాలిక నిషేధం పెట్టాలని, ఇతర వ్యాక్సిన్లకు ఫాస్ట్ ‌ట్రాక్‌ ఆమోదం ఇవ్వాలని, అవసరమైన ప్రతి ఒక్కరికీ టీకాలు వేయాలని కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన ఒక రోజు తర్వాత ఈ సమావేశం జరిగింది. వ్యాక్సిన్ల ఎగుమతి ‘‘ఓ ఖ్యాతి గడించే ప్రచార పక్రియనా..?’’ అని ప్రశ్నిస్తూ రాహుల్‌ ‌గాంధీ మోడీని విమర్శించారు. ఏప్రిల్‌ 11 ‌నుండి 14 వరకు వ్యాక్సిన్‌ ‌ఫెస్టివల్‌ ‌నిర్వహించాలని ముఖ్యమంత్రులకు పిఎం చేసిన విజ్ఞప్తిని ప్రస్తావిస్తూ, కోవిడ్‌ -19 ‌కేసుల పెరుగుదల వలన వ్యాక్సిన్ల కొరత చాలా తీవ్రమైన సమస్య అని రాహుల్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. వాక్సిన్‌ ‌పంపిణిలో భారతదేశానికి మొట్టమొదటి ప్రయోజనం అందింది, అయినా మనం ఇంకా  నత్త నడక నడుస్తున్నాం, ప్రపంచంలోని అతిపెద్ద టీకా కార్యక్రమాల రూపకల్పన మరియు అమలులో భారతదేశం సమృద్ధిగా అనుభవం సాధించింది, ప్రస్తుత కాలంలో భారత్‌ 3 ‌నెలల్లో 1% కంటే తక్కువ జనాభాను పూర్తిగా వాక్సిన్‌ ‌వేయగలిగాము …అని ప్రభుత్వం పేర్కొంది. అయినప్పటికీ మన దేశం వ్యాక్సిన్‌ ‌కొరతను ఎదుర్కొంటున్నది. ఇలాంటి పరిస్థితిలో 6 కోట్లకు పైగా వ్యాక్సిన్లు ఎగుమతి చేయబడ్డాయి … ఈ ప్రభుత్వం తీసుకున్న అనేక ఇతర నిర్ణయాల మాదిరిగా వ్యాక్సిన్ల ఎగుమతి కూడా ఒక ప్రచార కార్యక్రమం అయ్యింది. ప్రచారం కోసం పౌరులను బలి చేస్తారా..? అని సోనియా ప్రశ్నిచారు. ప్రస్తుత 35,000 కోట్ల రూపాయలు వ్యాక్సిన్‌ ‌సేకరణకు కేటాయిస్తున్నారు దీన్ని రెట్టింపు చేయాలనీ కేంద్రాన్ని రాహుల్‌ ‌కోరారు. వ్యాక్సిన్‌ ‌సేకరణ మరియు పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ నిధులు ఇవ్వాలని, వినాశకరమైన రెండవ వేవ్‌లో బలహీన వర్గాలకు ప్రత్యక్ష ఆదాయ సహాయాన్ని అందించండి’’ అని రాహుల్‌ ‌గాంధీ తన లేఖలో పేర్కొన్నారు. భారతదేశం కోవిడ్‌ 19 ‌వైరస్‌ ‌రెండవ వేవ్‌లో పునరుద్ధరించిన దాడికి బలి కావటం దురదృష్టకరమని రాహుల్‌ ‌గాంధీ ఆరోపించారు. మన శాస్త్రజ్ఞులు వాక్సిన్‌ ‌సరఫరాదారులు ఒక పరిష్కారాన్ని అభివృద్ధి చేయడానికి ఓవర్‌ ‌టైం పనిచేశారు. అయితే వారి ప్రయత్నాలు కేంద్రం పేలవమైన అమలు మరియు పర్యవేక్షణ వలన నిరుపయోగం అవుతున్నాయి.. అని రాహుల్‌ ‌గాంధీ అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద టీకా కార్యక్రమాల రూపకల్పన మరియు అమలులో భారతదేశం సమృద్ధిగా అనుభవం సాధించిందనే విషయాన్నీ రాహుల్‌ ‌గుర్తించారు. ప్రస్తుత కాలంలో భారత్‌ 3 ‌నెలల్లో 1 శాతం కంటే తక్కువ జనాభాకు పూర్తిగా టీకాలు వేయగలిగాము అని రాహుల్‌ ‌తన ట్వీట్‌లో రాశారు. భారతదేశంలో ప్రస్తుత వాక్సిన్‌ ‌డ్రైవ్‌ ‌రేటు ప్రకారం దేశ జనాభాలో 75 శాతం టీకాలు వేయడానికి సంవత్సరాల కాలం పడుతుందని, ఇది విపత్తు ప్రభావాలను కలిగిస్తుందని, దీని వలన భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా క్షీణిస్తుందని రాహుల్‌ అన్నారు. ఈ పరిస్థితి కేంద్రీకరణ మరియు వ్యక్తి పూజ ప్రచార యావ వలన ఏర్పడిందని  రాహుల్‌ ‌గాంధీ అన్నారు. ప్రజారోగ్యం రాష్ట్ర విషయం అయినప్పటికీ కూడా వాక్సిన్‌ ‌సేకరణ నుండి రిజిస్ట్రేషన్‌ ‌వరకు రాష్ట్రాలను పక్కన పెట్టటం జరిగింది. అదనంగా ఆన్‌లైన్‌ ‌రిజిస్ట్రేషన్‌ ‌వలన పేదలలో ఎక్కువ భాగం మినహాయించబడ్డారు..అని రాహుల్‌ ‌గాంధీ అన్నారు.

Leave a Reply