Take a fresh look at your lifestyle.

వాక్సిన్ కనుగొనడమే మార్గం ..!

  • స్పష్టం చేసిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్

మానవాళిని అతలాకుతలం చేస్తున్న కొరోనా వైరస్ అంతం వాక్సిన్ ద్వారానే సాధ్యమని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అభిప్రాయం వ్యక్తం చేశారు .ఐక్య రాజ్య సమితి భాగస్వామ్య దేశాల 50 మంది ప్రతినిధులతో ఆంటోనియో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిద్ 19 కు సరయిన వాక్సిన్ కనుగొంటేనే మల్లి మామూలు పరిస్థితులు నెలకొంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అందరికి ఉపయోగ పడే ఈ వాక్సిన్ 2020 సంవత్సరం ఆఖరు కల్లా కనుకోగలరన్న విస్వాసముందన్నారు .కొరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి 2 బిలియన్ డాలర్ల విరాళాలు అవసరముందని ..అందులో 20 శాతం సేకరించగలిగామని ఆంటోనియో తెలిపారు .కొరోనా వైరస్ వ్యాప్తి నివారణలో పలు దేశాలు చేబడుతున్న చర్యలను , కృషిని ఐక్య రాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ప్రశంసించారు .

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!