Take a fresh look at your lifestyle.

వ్యాపిస్తున్న వైరస్‌లకు సమానత్వమే వ్యాక్సిన్‌

  • వెయ్యేళ్ల క్రితమే సమసమాజ హితాన్ని కాంక్షించిన రామానుజాచార్య
  • ఆయన వెయ్యేళ్ల పండుగకు చిహ్నంగా 216 అడుగుల విగ్రహం
  • శాస్త్రీయ పద్దతిలో 1035 హోమ గుండాలతో యాగం
  • లక్షా 35 వేల కిలోల స్వచ్చమైన ఆవు నెయ్యిని వినియోగిస్తున్నాం: చిన్న జీయర్‌ ‌స్వామి

సమాజమే దేవాలయంగా…సమసమాజ స్థాపనే ధ్యేయంగా వెయ్యేళ్ల క్రితం రామానుజాచార్యుల వారు బోధించిన సమానత్వాన్ని ప్రతిబింబించడమే ఉద్దేశ్యంగా రామానుజ సహస్రాబ్ది సమారోహం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చిన్న జీయర్‌ ‌స్వామి వెల్లడించారు. ఈనెల 2 నుంచి 14 వరకు ఈ కార్యక్రమాలు ప్రారంభం జరుగనున్నాయి. ఇందులో భాగంగా రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన రామానుజ సహస్రాబ్ది సమారోహంలో భాగంగా 216 అడుగుల రామానుజా చార్య సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. సోమవారం శంషాబాద్‌ ‌సమీపంలోని ముచ్చింతల లోని ఆశ్రమంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిన్న జీయర్‌ ‌స్వామి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహానీయుడు రామానుజా చార్యులు అనీ, ఆయన వెయ్యేళ్ల పండుగను ముచ్చింతల ఆశ్రమంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సమాజంలో ఎన్నో రకాల బాహ్య, అంతర ప్రయోజనాలను పొందేందుకు వీలుగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుత సమాజంలో వ్యాపిస్తున్న అసమానతలు అనే వైరస్‌లకు సమానత్వమే వ్యాక్సిన్‌ ‌నీ, దానిని తొలగించేందుకు కూడా ఈ సమారోహ కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. సహస్రాబ్ది కార్యక్రమాలలో భాగంగా ప్రత్యేకంగా నిర్మించిన యాగశాలలో 1035 కుండాలతో యజ్ఞం నిర్వహిస్తున్నామనీ, ఈ యజ్ఞానికి 1.5 లక్షల కిలోల స్వచ్చమైన ఆవు నెయ్యిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న భయంకరమైన వైరస్‌ ‌కోవిడ్‌ అనీ, దీని కంటే అసమానత్వం అనే వైరస్‌ ఇం‌కా భయంకరమైందని చెప్పారు. దీనికి కూడా వ్యాక్సిన్‌ ‌కావాలనీ, ధనం, జ్ఞానం, యోగ్యత, సామాజిక స్థితిగతులు, విశ్వాసాల్లో హెచ్చు తగ్గులు ఉంటాయనీ, ఇవన్నీ ఉన్నా ఒకే సమాజంగా మానవుడు బతకాలన్నారు. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదనీ, దానికి సమానత అనే వ్యాక్సిన్‌ను వేయ్యేళ్ల క్రితమే రామానుజా చార్యల వారు అందించారని పేర్కొన్నారు.

ఆ సమతామూర్తి సిద్ధాంతాలు నేటి సమాజానికి అవసరమనీ, ప్రస్తుతం ఉన్న స్థితికి సమతామూర్తి ఒక మందని చెప్పారు. శ్రమ పడాలి, సాధించాలని, సమాజానికి అందించాలనేదే రామానుజా చార్యల వారి సిద్ధాంతమనీ, దానికి క్రమశిక్షణతో ఆచరించడమే సమతామూర్తికి నిజమైన నిదర్హనమన్నారు. ప్రపంచానికి సమానత్వాన్ని ప్రబోధించడానికే సమతామూర్తి కేంద్రాన్ని నిర్మించామనీ, సమానత్వం కోసం కృషి చేసిన వ్యక్తుల చరిత్రను సమతా స్ఫూర్తి కేద్రంలో డిజిటల్‌ ‌రూపంలో ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు. అందరం సమానమే, కులం అనే హద్దలు దాటుదాం అనే భావనను చాటుకుందామన్నది రామానుజుల వారి సిద్ధాంతమనీ, ఈ సిద్ధాంతాలు ఇప్పటి సమాజానికి అత్యవసరమని స్పష్టం చేశారు. అక్కడ 108 దివ్య దేశాలను సైతం ఏర్పాటు చేస్తున్నామనీ, వీటిని దర్శించుకునే ప్రజలు రామానుజా చార్యులు అంత ఎత్తుకు ఎదగాలన్నదే మా భావన అని ఈ సందర్భంగా చిన్న జీయర్‌ ‌స్వామి స్పష్టం చేశారు.

Leave a Reply