వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఆదిలాబాద్‌ ‌రిమ్స్‌లో 40 మంది చిన్నారులకు అస్వస్థత వికటించిన టీకా మందు

February 5, 2020

Vaccine is an illness vaccine for young children

ఆదిలాబాద్‌ ‌జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో ఒకేసారి 40 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రి ఆవరణలో చిన్నారుల తల్లిదండ్రుల హాహాకారాలు మిన్నంటాయి. ఆసుపత్రి వైద్యులు పిల్లలకు ఎటువంటి ప్రాణహాని లేదని తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నామని హామీ ఇచ్చారు. వీరిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రత్యేక వైద్య చికిత్సలు అందిస్తున్నారు. బుధవారం 40 మంది చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చారు. 10నిమిషాల వ్యవధిలోనే వీరందరిపై దద్దుర్లు ఏర్పడి పిల్లలు ఏడుపు ప్రారంభించారు. దీంతో ఆందోళనకు గురైన చిన్నారుల తల్లిదండ్రులు వైద్యులకు సమాచారం అందించారు.

వెంటనే అప్రమత్తమైన రిమ్స్ ‌వైద్యులు వ్యాధి నిరోధక టీకా మందులో లోపం ఉన్న విషయాన్ని గుర్తించారు. శరవేగంగా స్పందించి వెంటనే 40 మందికి ప్రత్యేక చికిత్సలు ప్రారంభించారు. ఎక్కువ ప్రమాదం ఉన్న 10 మంది పిల్లలకు ప్రత్యేక చికిత్సను అందించి రక్షించేందుకు ప్రయత్నాలను వేగవంతం చేశారు. పిల్లలకు ఇచ్చిన టీకా మందులు పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. దీనిపై విచారణ జరుపుతామని రిమ్స్ ‌డైరెక్టర్‌ ‌బలరాం నాయక్‌ ‌వెల్లడించారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన తెలిపారు.