- అఖిలపక్ష సమావేశం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
- సురక్షితమైన, తక్కువ ధర కు వ్యాక్సీన్ రూపకల్పన
అజేయ సంకల్ప శక్తి తో మహమ్మారిపై పోరాటం
భారతదేశం లోని పౌరులు అజేయమైన సంకల్పం తో ఈ మహమ్మారి తో పోరాడారని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఈ యావత్తు సమరం లోను వారు చాటిన సంయమనం, కనబరచిన ధైర్య సాహసాలు, శక్తి పోల్చలేనివి, ఇదివరకు ఎన్నడూ ఎరుగనివి అని ఆయన అన్నారు. మనం మన తోటి భారతీయులకు సాయపడటం ఒక్కటే కాకుండా ఇతర దేశాల పౌరులను కాపాడటానికి కూడా శాయశక్తులా కృషి చేశామని ఆయన అన్నారు. భారతదేశం అనుసరించిన శాస్త్రీయ విధానాలు పరీక్ష ల సంఖ్య ను పెంచేందుకు తోడ్పడ్డాయని, అంతేకాకుండా అవి పాజిటివిటీ రేటు ను, కోవిడ్ మరణాల రేటు ను కూడా తగ్గించాయన్నారు.
టీకాలను వేయించే ప్రక్రియ పై వదంతులు వ్యాప్తి లోకి రావచ్చంటూ ప్రధాన మంత్రి హెచ్చరిక చేశారు. అదే జరిగితే, ఇటు ప్రజా హితానికి, అటు దేశ హితానికి భంగకరం కాగలదని ఆయన అన్నారు. దేశ పౌరులను మరింత చైతన్యవంతులుగా తీర్చిదిద్దవలసిందని, ఆ కోవ కు చెందిన వదంతులు ఎంత మాత్రం వ్యాప్తి చెందకుండా అడ్డుకోవాలని నాయకులందరికీ ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్ పై పోరాడడం లో విలువైన సూచనలను, సలహాలను ఇచ్చినందుకు అన్ని పక్షాల నాయకులకు ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. దీనితో పాటే, పౌరులందరూ నిరంతరం అప్రమత్తులై ఉండవలసిందిగాను, వైరస్ విషయం లో తీసుకోవలసిన నివారక చర్యల పట్ల ఎలాంటి అజాగ్రత్త కు తావు ఇవ్వకూడదంటూను ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం లో పాల్గొన్న రాజకీయ పక్షాల లో భారత జాతీయ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డిఎమ్‌కె, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జెడి(యు), బిజెడి, శివ సేన, టిఆర్ఎస్, బిఎస్పి, ఎస్పి, ఎఐఎడిఎమ్కె, బిజెపి లు ఉన్నాయి. టీకాలను ఇప్పించే కార్యక్రమం ప్రభావవంతంగా, వేగవంతంగా ముందుకు సాగేటట్లు చూడడానికి పూర్తి స్థాయి లో తమ సమర్థన ఉంటుందని నాయకులు ప్రధాన మంత్రి కి హామీ ని ఇచ్చారు. మహమ్మారి ని ఎదుర్కోవడంలో ప్రధాన మంత్రి నాయకత్వాన్ని వారు మెచ్చుకొన్నారు. శాస్త్రవేత్తల సముదాయాన్ని, అలాగే టీకా ను అభివృద్ధిపర్చడంలో టీకా తయారీదారు.