Take a fresh look at your lifestyle.

కొరోన నివారణకు వ్యాక్సినేషన్‌ ‌మాత్రమే పరిష్కారం: మంత్రి కెటిఆర్‌

‌సిరిసిల్ల, మే 28 ,(ప్రజాతంత్ర ప్రతినిధి) : కొరోనా వైరస్‌ను తుదముట్టించడానికి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్లు వేయడమే శాశ్వత పరిష్కారమని రాష్ట్ర మున్సిపల్‌ ,ఐటి శాఖల మంత్రి కె.తారక రామారావు వ్యాఖ్యానించారు.రూ 22 కోట్ల వ్యయంతో వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్‌లో నిర్మించిన వంద పడకల హాస్పిటల్ ని శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొరోనా బారిన పడిన వారికి అన్ని మందులను అందుబాటులో ఉంచామని,ప్రస్తుతం కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి తగ్గుతుందని,ఒక వేళ పెరిగితే దానిని అదుపు చేయడానికి సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కెటిఆర్‌ అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్ ల్లో ఆక్సిన్‌ ‌సిలిండర్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని,బ్లాక్‌,‌వైట్‌ ‌ఫంగస్‌ల చికిత్స కోసం సైతం తాము అన్ని మందులను,అందుబాటులో ఉంచామని వెల్లడించారు.కొరోనా కట్టడి కోసం తయారయ్యే వ్యాక్సిన్లలో 85శాతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని,అయినప్పటికిని రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ‌పక్రియను వేగవంతంగా చేయిస్తున్నామని అన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్ష 22 వేల మందికి వ్యాక్సిన్లు ఇచ్చామని,ఇంటింటా జ్వర సర్వేలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.వేములవాడలో వంద పడకల హాస్పిటల్ నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు.ఈ హాస్పిటల్ లో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమిస్తామని,ప్రజలంతా ఈ హాస్పిటల్ లో వైద్య సేవలను వినియోగించుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టెస్కాబ్‌ ‌చైర్మన్‌ ‌కొండూరి రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ ‌న్యాలకొండ అరుణ,వేములవాడ మండల పరిషత్‌ అధ్యక్షురాలు బూర వజ్రమ్మ,వేములవాడ మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌రామతీర్థపు మాధవి,జిల్లా కలెక్టర్‌ ‌కృష్ణ భాస్కర్‌,‌డిఎం& హెచ్‌ఓ ‌డాక్టర్‌ ‌సుమన్‌మోహన్‌రావు,సిరిసిల్ల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ‌డాక్టర్‌ ‌మురళీధర్‌రావు,వేములవాడ ఆసుపత్రి వైద్యాధికారి రేగులపాటి మహేశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

హాస్పిటల్ ప్రారంభాన్ని స్వాగతిస్తున్నాం…. ఆది శ్రీనివాస్‌
‌వేములవాడ ప్రభుత్వ హాస్పిటల్ ప్రారంభాన్ని తాము స్వాగతిస్తున్నామని కాంగ్రెస్‌ ‌పార్టి రాష్ట్ర కార్యదర్శి ఆది శ్రీనివాస్‌ ‌వ్యాఖ్యానించారు.అయితే వేములవాడ ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో పాల్గొనక పోవడం విడ్డూరంగా ఉందని,దీనిపై మంత్రి కెటిఆర్‌ ‌సమాధానం చెప్పాలని అన్నారు.

మీడియా ప్రతినిధులను అనుమతించని అధికారులు
కోవిడ్‌ ‌నిబంధనల పేరిట ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మీడియా ప్రతినిధులను అనుమతించలేదు.అయితే ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమాలను డిపిఆర్‌ఓ ‌ద్వారా వెల్లడించారు.కాని ఈ ప్రారంభోత్సవానికి మున్సిపల్‌ ‌పాలక వర్గం,ఇతర నాయకులను మాత్రం అనుమతించిన అధికారులు మీడియా ప్రతినిధులను అనుమతించడానికి ఆసక్తి చూపకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply