Take a fresh look at your lifestyle.

తిరుమలకు వెళ్లే వారికి వ్యాక్సినేషన్‌ ‌తప్పనిసరి

కొత్త నిబంధన అమల్లోకి తెచ్చిన టిటిడి
తిరుమల,సెప్టెంబర్‌ 22 :  ‌కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్‌ ‌పూర్తయిన సర్టిఫికెట్‌ ‌లేదా మూడు రోజుల ముందు కరోనా నెగిటివ్‌ ఉన్నట్లు సర్టిఫికెట్‌ ‌తేవాల్సి ఉంటుంది. అప్పుడే దర్శనానికి అనుమతి ఇస్తారు. ఈ మేరకు  టీటీడీ చైర్మన్‌ ‌వై.వి.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కొవిడ్‌ ‌నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 25న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ చైర్మన్‌ ‌చెప్పారు.

సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు ఎనిమిది వేల చొప్పున సర్వ దర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు. 26 నుంచి తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. అక్టోబరు మాసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఎల్లుండి ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శ్రీవారి సర్వదర్శన టికెట్ల పై కీలక ప్రకటన చేశారు కొత్తగా నియామకమైన టీటీడీ ఛైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి. ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌లో శ్రీ వారి సర్వదర్శనం టికెట్లు విడుదల చేస్తామని ప్రకటించారు ఛైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి. సెప్టెంబర్‌ 26 ‌నుంచి అక్టోబర్‌ 31 ‌వ తేది వరకు సంభందించిన టికెట్ల ను విడుదల చేస్తూన్నామని వెల్లడించారు. రోజుకి 8 వేల చోప్పున టిక్కెట్లు విడుదల చేస్తూన్నామన్నారు.

26 తేది నుంచి తిరుపతి లో ఆఫ్‌ ‌లైన్‌ ‌లో జారి చేస్తున్న టోకెన్లు నిలిపి వేస్తూన్నామని స్పష్పం చేశారు. 24 వ తేది ఉదయం 9 గంటలకు ఆన్‌ ‌లైన్‌ ‌లో అక్టోబర్‌ ‌మాసానికి సంభందించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల చేస్తామని ప్రకటించారు.

Leave a Reply