Take a fresh look at your lifestyle.

జర్నలిస్టులకు వాక్సినేషన్ ..

పర్యవేక్షించిన టీయూడబ్ల్యూజే బాధ్యులు
హైదరాబాద్,మే 28: శుక్రవారం బషీర్ బాగ్ సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని సమాచార శాఖ అధికారులతో కలిసి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర బాధ్యులు పర్యవేక్షించారు.

సంఘం రాష్ట్ర ప్రధాన కె.విరాహత్ అలీ, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యుడు ఏ.రాజేష్, హెచ్.యు.జే కార్యదర్శి శిగ శంకర్ గౌడ్, సమాచార, పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్, ఆరోగ్య అధికారి డాక్టర్ సువర్ణ తదితరులు పర్యవేక్షించారు. ఈ శిబిరం నేడు కూడా కొనసాగుతుందని, జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విరాహత్ అలీ కోరారు.

Leave a Reply