Take a fresh look at your lifestyle.

45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌

  • ఏ‌ప్రిల్‌ 1 ‌నుంచి పంపిణీ
  • కొరోనా తీవ్రత దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో కొరోనా ఉధృతి రోజురోజుకూ పెరగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ ‌చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్‌ 1 ‌నుంచి ఈ నిర్ణయం అమలవుతుందనీ, టీకాను కూడా ఆరోజు నుంచే పంపిణీ చేయడం జరుగుతుందని వెల్లడించింది. ఈమేరకు మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కేంద్ర క్యాబినెట్‌ ‌సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రెండో దశలో కొరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో యువత 45 ఏళ్లు పైబడిన వారిని కూడా టీకా కార్యక్రమం కిందికి తీసుకు రావాలని రాష్ట్రాలు కేంద్రాన్ని అభ్యర్థించాయి.

ఈ క్రమంలోనే మంగళవారం కేంద్రం నుంచి తాజా ప్రకటన వెలువడింది. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో కేంద్ర మంత్రి ప్రకాశ్‌ ‌జావడేకర్‌ ‌మాట్లాడుతూ 45 లేక అంతకన్నా ఎక్కువ వయసున్న వారంతా టీకా వేయించుకోవడం కోసం రిజిస్ట్రేషన్‌ ‌చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొరోనా వైరస్‌ ‌టాస్క్‌ఫోర్స్, ‌నిపుణులు ఇచ్చిన సూచనలను అనుసరించి కేబినెట్‌ ఈ ‌నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు, ప్రస్తుతం నడుస్తున్న టీకా కార్యక్రమం కింద మార్చి 22 నాటికి కేంద్రం 4,84,94,594 మందికి టీకా డోసులను అందజేసింది.

Leave a Reply