Take a fresh look at your lifestyle.

సూపర్‌ ‌స్పైడ్రర్లందరికీ నేటినుంచి వ్యాక్సినేష్‌..!

  • ‌జర్నలిస్టులను ఫ్రంట్‌లైన వారియర్లుగా గుర్తించిన ప్రభుత్వం
  • సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో ఏర్పాట్లు చేసిన యంత్రాంగం
  • అధికారులకు స్పస్టమైన ఆదేశాలు ఇచ్చిన సిఎస్‌

సూపర్‌ ‌స్పైడ్రర్లందరికీ శుక్రవారం నుంచి వ్యాక్సిన్‌ ‌వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సిఎం కెసిఆర్‌ ఆదేశాల మేరకు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లుచేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. రాష్ట్రంలోని దాదాపు 30 లక్షల మంది సూపర్‌ ‌స్పైడ్రర్లందరికీ వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లపై సీఎస్‌ ‌జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ‌నిర్వహించి తగు సూచనలు చేశారు. వివిధ క్యాటగిరీల పనులుచేసే వారికి ఆయా విభాగాల అధికారులను ఇంచార్జీలు నియమించి, వారికి బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్లను సీఎస్‌ ఆదేశించినట్టు సమాచారం.

ఎల్‌పీజీ సిలిండర్ల డెలివరీ సిబ్బంది, పెట్రోల్‌ ‌బంకుల్లో పనిచేసే సిబ్బంది, రేషన్‌షాపుల డీలర్లకు ఇంచార్జీ అడిషనల్‌ ‌కలెక్టర్లు.. ఆటోడ్రైవర్లు, క్యాబ్‌ ‌డ్రైవర్లకు మోటార్‌ ‌వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు.. కూరగాయలు, పువ్వులు, పండ్లు, మాంసం, చేపలు విక్రయించేవారికి మున్సిపల్‌ ‌కమిషనర్లు, మద్యం విక్రయించేవారికి ఎక్సైజ్‌ ‌సూపరింటెండెంట్లు, జర్నలిస్టులకు డీపీఆర్వోలు ఇంచార్జీలుగా ఉండి వ్యాక్సిన్‌ ‌వేయించాలని కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశించినట్టు తెలిసింది. జర్నలిస్టులను ఫ్రంట్‌లైన వారియర్లుగా గుర్తించినందుకు ప్రభుత్వానికి జర్నలిస్టు సంఘాల నాయకులు సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply