Take a fresh look at your lifestyle.

ఎపిలో ఐదురోజుల పాటు టీకా ఉత్సవం

  • రోజుకు 6 లక్షల మందికి వ్యాక్సిన్‌ ‌పక్రియ
  • సిఎం జగన్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 11 ‌నుంచి 14 వరకు టీకా ఉత్సవ్‌ ‌నిర్వహించాలని ఏపీ సీఎం జగన్‌ ‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ సమయంలో రోజుకు కనీసం 6లక్ష మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా చూడాలని నిర్దేశించారు.ఆ నాలుగు రోజులు కనీసంగా 24లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. అవసరమైన వ్యాక్సిన్‌ ‌డోసులు కేంద్రాన్ని కోరాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేంద్రంలోని అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు ముగిసినందున వ్యాక్సిన్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలన్న సీఎం.. దీని కోసం అన్ని రకాలుగా సిద్ధం కావాలని అధికారులకు స్పష్టం చేశారు. టీకా ఉత్సవ్‌ ‌విజయవంతం చేశాక మరిన్ని డోసులు తెప్పించు కోవడంపై దృష్టిపెట్టాలన్నారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ ‌తర్వాత కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌పై సవి•క్షించిన సీఎం ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు.  గ్రావి•ణ ప్రాంతాల్లో రోజుకు 4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రోజుకు 2 లక్షల మందికి వ్యాక్సిన్‌ అం‌దించే లక్ష్యంతో పని చేయాలని సీఎం వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇంకా మిగిలిపోయిన 45 ఏళ్లు పైబడిన కోటి మందికి నెల రోజుల్లో వ్యాక్సినేషన్‌ ‌పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ మేరకు డోసులు సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరాలని అధికారులకు సూచించారు. నియంత్రణ, వ్యాక్సినేషన్‌ ‌పక్రియపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సవి•క్ష నిర్వహించారు. కోవిడ్‌ ‌చికిత్స పేరుతో ప్రైవేట్‌ ఆస్పత్రులు దోపిడీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, మాస్క్ ‌పెట్టుకోని వారి పట్ల కఠినంగా వ్యవహరిం చాలని స్పష్టం చేశారు.

కోవిడ్‌ ‌నివారణకు వ్యాక్సినేషన్‌ ఒకటే మార్గమని, ఈ పక్రియను చురుగ్గా కొనసాగించడంపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఇప్పటికే లాక్‌డౌన్‌ ‌వల్ల రూ.21 వేల కోట్లు నష్టపోయామని, మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని, ఇందుకు ప్రజల్లో అవగాహన కలిగించాలని సూచించారు. కోవిడ్‌ ‌నియంత్రణలో భాగంగా టెస్టింగ్‌, ‌ట్రేసింగ్‌, ‌ట్రీట్‌మెంట్‌పై దృష్టి సారించాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి రోజు సగటున 1.4 లక్షల మందికి వ్యాక్సిన్‌ ‌వేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సినేషన్‌కు యంత్రాంగం సర్వం సమాయత్తమై ఉందని, అయినా తగినన్ని డోసుల వ్యాక్సిన్‌ అం‌దుబాటులో లేదని సీఎంకు వివరించారు. ఇవాల్టికి(గురువారం) 3 లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, 2 రోజులకు సరిపడా నిల్వలే రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మన అవసరాలకు తగినన్ని డోసుల వ్యాక్సిన్‌ ‌సరఫరా కావడం లేదని చెప్పారు.

Leave a Reply