Take a fresh look at your lifestyle.

వ్యాక్సినేషన్‌… ‌సాగు చట్టాల చర్చలు… అన్నీ మొక్కుబడే

ఒక వంక కొరోనా వేక్సినేషన్‌ ‌కార్యక్రమం ప్రారంభం,మరో వంక సాగుచట్టాలపై రైతులు కొనసాగిస్తున్న ఆందోళనతో దేశంలో సర్వత్రా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. సాగు చట్టాలపై కేంద్రం దిగిరాక తప్పదనీ, వాటిని ఉపసంహరించుకోవడం మినహా కేంద్రానికి మరో దారి లేదని కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ స్పష్టం చేశారు.ఆయనహొ శుక్రవారం తన సోదరి ప్రియాంకతో కలిసి రైతు సంఘాల ప్రతినిధులను కలుసుకున్నారు. రైతులకు కాంగ్రెస్‌ ‌మద్దతు ఎప్పటికీ ఉంటుందనీ, సమస్య పరిష్కారం అయ్యే వరకూ కాంగ్రెస్‌ ‌రైతుల వెంట ఉంటుందని రాహుల్‌ ‌హామీ ఇచ్చారు. ఇదిఇలా ఉండగా, రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు శుక్రవారం జరిపిన తొమ్మిదవ విడత చర్చలు కూడా అపరిష్కృతంగానే ముగిశాయి. కేంద్రం చట్టాల ఉప సంహరణకు ససేమిరా అనడంతో రైతు సంఘాల నాయకులు మరింత బిగిసినట్టు కనిపిస్తోంది. దేశంలో ఏ ప్రాంతంలోనూ సంక్రాంతి ఉత్సాహం, సంబరాలు కానరాలేదు. వ్యవసాయానికి మారు పేరు రైతులు అయినప్పుడు రైతులు అసందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు ఇక సంతోషం, సంబరాలు ఎక్కడినుంచి వొస్తాయి. దేశంలో అన్ని ప్రాంతాలలో రైతులు వ్యవసాయ చట్టాల ప్రతులను భోగి మంటల్లో దగ్ధం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు చోట్ల ఇటువంటి దృశ్యాలు కానవచ్చాయి. కేంద్రం ఈసారి రైతులకు శుభాకాంక్షలు తెలియజేయలేదు. ప్రతిసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏ పండుగొచ్చినా ఆయా రంగాల ప్రజలకు ట్విట్టర్‌ ‌ద్వారా సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసేవారు.ఈసారి అటువంటి సంతోషం లేనందున ట్విట్టర్‌ ‌శుభాకాంక్షలు వెలువడలేదు. రైతుల మనో భావాలను అర్ధం చేసుకోవడంలోహొ కేంద్రం విఫలమైందని వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలో వ్యవసాయం అన్ని ప్రాంతాల్లోనూ ఒకే తీరులో లేదు. మోడీ అధికారంలోకిహొవొచ్చినప్పటి నుంచి ఒకే దేశం ఒకే చట్టం నినాదంతో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఇవి ఆకర్షణీయ నినాదాలుగా కనిపించినప్పటికీ ఆచరణలో సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భౌగోళికంగా, వాతావరణ పరంగా దేశమంతటా ఒకే రీతిలో పరిస్థితులు లేవు. రైతులు వేసే పంటలు కూడా ఒకే రీతిలో లేవు. అటువంటప్పుడు అందరికీ ఒకే సూత్రం ఎలా పని చేస్తుంది., గిట్టుబాటు ధర లేదా మద్దతు ధర విషయం కూడా అంతే, ఉదాహరణకు ఆంధప్రదేశ్‌ ‌లోనూ, మరి కొన్ని ప్రాంతాల్లో టమాటా ఉత్పత్తి బాగా పెరిగి రోడ్డుపై పోస్తున్నారు. కిలో రూపాయి ధర కూడా పలకడం లేదని రైతులు వాపోతున్నారు. అలాగే,ఇతర పంటలనూ. ప్రభుత్వం ఈ కోణం నుంచి ఆలోచించడం లేదు. రైతులకు ఏది అవసరమో,ఏది మంచో నిర్ణయించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది.

రైతుల్లో ఉత్సాహాన్ని గమనించి ప్రోత్సహించాలి. రైతుల్లో ఉత్సాహం కూడా ఎల్లప్పుడూ ఒకే రీతిలో ఉండదు. ఆయా కాలాల్లో తమకు వచ్చిన ఫలసాయాలనూ, రాబడిని బట్టి రైతులు స్పందిస్తూ ఉంటారు. లాభ నష్టాల కోసం కాకుండా,వ్యవసాయం ఒక వ్యసనంగా భావించి పంటలు వేస్తుంటారు. తెలంగాణ ప్రభుత్వం ఆ మధ్య నియంత్రిత సాగు అనే నినాదం ఇచ్చింది. కొన్ని పంటలను పరిమితమైన విస్తీర్ణంలోనే పండించాలని. అలాగే, ఫలానా రకం వరిని మాత్రమే పండించాలని. అలా చేసి నష్టపోయిన రైతులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రైతులు వద్దన్నాసంప్రదాయ వరి రకాలను పండిస్తారు.హొ మరో రకం వరి పండిస్తేహొహొ లాభసాటి కాదనేహొ అనుమానం వారిని పీడిస్తుంటూంది. అందువల్ల వ్యవసాయ రంగంలో రైతులు ఏది అనుసరించాలో ఏది కూడదో ఆహొ విచక్షణను వారికేహొవొదిలి వేస్తే ప్రభుత్వం మీద అపవాదు పడే అవకాశం ఉండదు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం అనుభవ పూర్వకంగా తెలుసుకుంది. రైతుల పంటల విషయంలో కానీ, పంటల విస్తీర్ణం విషయంలో కానీ, ప్రభుత్వం జోక్యం చేసుకోదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఇటీవల ప్రకటించారు.ఇలాగే.అన్ని రాష్ట్రాల్లోనూ. ఇంకా చెప్పాలంటే రాజకీయ నాయకుల కంటే రైతులకే వ్యవసాయ రంగంలో అనుభవం ఎక్కువ. ప్రతి నాయకుడూ తాను రైతు బిడ్డనేనని చెప్పుకుంటారు.కానీ, ఆచరణలోకి వొచ్చే సరికి రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.

Corona vaccination

ఇది ఏ ఒక్కరోజో కాదు, మొదటి నుంచి జరుగుతున్నదే. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. పక్క రాష్ట్రాల్లోనూ జరుగుతున్నదే. ఆ మధ్య మహారాష్ట్ర రైతులు పాలు, పండ్లు, కూరగాయలు రోడ్లమీద పోసి నిరసన తెలిపారు.మన రాష్ట్రాల్లోనూ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. గిట్టుబాటు ధర ల భించనందుకు రైతులు నిరసన తెలిపే విధానాల్లో ఇదొకటి. విద్యుత్‌ ‌చట్టంలో వివాదాస్పద అంశాలను పక్కన పెట్టేందుకు అంగీకరించిన కేంద్రం తొమ్మిదవిడత చర్చల్లో మరి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలించేందుకు అంగీకరించింది.కానీ, రైతులు మాత్రం కొత్త చట్టాలు రద్దు తప్ప మరి దేనికీ తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు.ఇలాంటి నేపధ్యంలో నేటి నుంచి కొరోనా •నివారణకు వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించనుంది.ఈ వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం గురించి సరైన అవగాహన కల్పించడంలో కొన్ని చోట్ల ఒక విధంగానూ, మరి కొన్ని చోట్ల మరో విధంగానూ పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధప్రదేశ్‌ ‌లో వలం టీర్ల వ్యవస్థ ఏర్పాటు ఇలాంటి సందర్భాల్లో ఎంతో ఉపయుక్తంగా ఉన్నట్టు కనిపిస్తోంది.ఇతర చోట్ల ఇలాంటి వ్యవస్థలు లేవు. ఆరోగ్య సిబ్బంది తమ వద్దకు వచ్చిన వారికి టీకాలు వేయడం తప్ప ప్రజలవద్దకు వెళ్ళి వారికి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. దీంతో ఈ కార్యక్రమం లక్ష్యం పూర్తిగా నెరవేరే అవకాశాలు లేవు. మొక్కుబడిగా సాగే అవకాశం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలను దృష్టిలో పెట్టుకుని రూపొందించాలి. కొరోనా విషయంలో కూడా ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి.

Leave a Reply