Take a fresh look at your lifestyle.

వ్యాక్సిన్‌ ‌వేయించుకున్న సిఎం జగన్‌ ‌దంపతులు

ఆం‌ధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం సతీమణి వైఎస్‌ ‌భారతితో కలిసి వ్యాక్సిన్‌ ‌వేయించుకున్నారు. గుంటూరులోని భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయంలో ముఖ్యమంత్రి కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌వేయించుకున్నారు. అనంతరం 45 ఏళ్లు దాటిన పౌరులందరికీ వార్డు,గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకముందు ముఖ్యమంత్రికి వ్యాక్సిన్‌ ‌వేసేందుకు గుంటూరులోని సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ ‌కేంద్రం, రిజిస్టేష్రన్‌, ‌వ్యాక్సిన్‌ ‌రూమ్‌, అబ్జర్వేషన్‌ ‌రూమ్‌ను హోం మంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్‌ ‌వివేక్‌యాదవ్‌ ‌బుధవారం పరిశీలించారు.

సీఎం జగన్‌ ‌మాట్లాడుతూ.. కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మూడు నెలల్లో రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. గ్రామాల్లో వ్యాక్సినేషన్‌పై వాలంటీర్లకు అవగాహన కల్పిస్తారు. ఇంటింటికీ వెళ్లి 45 ఏళ్లు దాటినవారి వివరాలను వాలంటీర్లు దగ్గరుండి సేకరిస్తారు. ఏ రోజు వ్యాక్సినేషన్‌ ‌జరుగుతుందో ముందుగానే వాలంటీర్లు చెబుతారు. ప్రతీ మండలంలోని పీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Leave a Reply