Take a fresh look at your lifestyle.

మెట్రో రైలు ప్రయాణానికి అనుమతి ..

  అన్ లాక్ 4 మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం 
 అన్ లాక్ 4 కు కేంద్రం శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది .మరికొన్ని కార్యకలాపాలకు అనుమతులిస్తూ ప్రకటన విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లు మినహా ఈ అనుమతులు సెప్టెంబర్ 1 నుండి అమలులోకి రానున్నాయి. సెప్టెంబర్ 7 నుంచి కొన్ని షరతులతో మెట్రో రైళ్ల ప్రయాణానికి అనుమతి లభించింది. సెప్టెంబర్ 21 నుంచి అన్ని 100 మందికి మించకుండా అన్ని సామూహిక కార్యక్రమాలకు ..పెళ్లిళ్లు, రాజకీయ సభలు, సమావేశాలు నిర్వహించుకోవొచ్చు. ఈ సమావేశాల్లో కోవిద్ 19 నిబంధనలను ..మాస్క్, భౌతిక దూరం  . థర్మల్ స్క్రీనింగ్ ,శానిటయిజేషన్  లాంటివి తప్పక పాటించాలి. ఓపెన్ ఎయిర్ థియేటర్లు  1 సెప్టెంబర్ నుంచి నడుపు కోవొచ్చు .30, సెప్టెంబర్ వరకు విద్యా సంస్థలను తెరవడానికి వీలు లేదని ఆదేశాలు జారీ చేసింది . ఆన్ లైన్ బోధనను ప్రోత్సహించాలని ప్రకటనలో పేర్కొంది.  ఓపెన్ ఎయిర్ థియేటర్లు మినహా సినిమా థియేటర్లు , ఇతర ప్రదర్శనా స్థలాలకు , స్విమ్మింగ్ పూల్స్ మినహా కంటైన్మెంట్ లేని ప్రాంతాల్లో కూడా కేంద్రం  అనుమతి నిరాకరించింది .లాక్ డౌన్ ను సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది.

Leave a Reply