జానపద బాణీతో ఉర్రూతలూగించిన వాగ్గేయకారుడు
త్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజాకవి, ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మృతిపట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు . వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించిందని పేర్కొన్న ఆయన.. ఆయన వ్యక్తిగతంగా నాకు ఆప్తులు… జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘పామను పొడిచిన చీమలు‘న్నాయంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారని తన ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో ఓ మహాశిఖరంగా ఆయన నిలిచిపోతారన్న సీఎం.. వంగపండు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
ఉత్తరాంధ్ర జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి తీరని లోటని క్రీడలు, సాంస్క•తిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. వంగపండు ప్రసాదరావు సాంస్క•తిక రంగానికి ఓ ఆణిముత్యం. అలాంటి ఆణిముత్యం భౌతికంగా దూరం కావడం బాధాకరం. వంగపండు పాటలోనే సామాజిక చైతన్యం ఉంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజాకవి, కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి తీరని లోటని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. వంగపండు మృతికి మంగళవారం ఆయన ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జానపదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్లిన కళాకారుడు వంగపండు. ఆయన విజయనగరం జిల్లా వాసి కావడం తెలుగువారికి గర్వకారణమన్నారు. తన పాటలు, రచనలు, ప్రదర్శనలతో వంగపండు ప్రజల్లో చైతన్యం నింపారని, దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలను తన పాటలతో వినిపించిన గొప్ప కళాకారుడని తెలిపారు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ఉర్రూతలూగించి.. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో ఒక మేరుశిఖరంగా వంగపండు నిలిచిపోతారని లక్ష్మణరెడ్డి తెలిపారు. ఉత్తరాంధ్ర గళం వంగపండు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారన్న వార్త దిగ్బాం•-రతికి గురిచేసిందన్నారు. వందలాది జానపద గేయాలతో అయన ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చారని వంగపండు కుటుంబ సభ్యులకు లక్ష్మణరెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అలాగే ప్రజా వాగ్గేయకారుడు, జానపద దిగ్గజం వంగపండు ప్రసాద్ మృతి చెందడం బాధాకరమని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు.ఉత్తరాంధ్ర వాసి అయినా.. తెలంగాణ ఉద్యమానికి వంగపండు సంపూర్ణ మద్దతు పలికారని వినోద్ కుమార్ గుర్తు చేశారు.ఏం పిల్లడో వెళదామస్తవ.. పాముని పొడిచిన చీమలున్నాయట.. వంటి అనేక పాటలు రాసి గజ్జె కట్టి ఆడిపాడి ప్రజలను చైతన్య వంతులను చేశారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. వంగపండు కుటుంబ సభ్యులకు ఆయనర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు