Take a fresh look at your lifestyle.

ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు కీలకం ..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రవేశపెట్టిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వాపస్‌ ‌తీసుకుంటున్నట్టుగా ఆయన వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా చేసిన ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురి చేయగా ..వాపస్‌ ‌నిర్ణయం రాజకీయ ప్రేరేపితమైందనీ ..అయినా ఆలస్యమైందనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మిగతా 4 రాష్ట్రాలతో సహా దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌ ‌లో వొచ్చే సంవత్సరం జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ కి కీలకం కానున్నాయి. ఉత్తర ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్‌ ‌పాలన పై ప్రజా వ్యతిరేకత రోజు రోజుకూ తీవ్రతరం కావడం ఆ పార్టీ కి ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రం లో అన్ని వర్గాలు ఆదిత్యనాథ్‌ ‌పాలన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా ..మరో వైపు ఉత్తర ప్రదేశ్‌ ‌లో ముఖ్యమైన అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌నేతృత్వంలోని సమాజ్‌ ‌వాది పార్టీ రాబోయే ఎన్నికల్లో వోట్లు చీలకుండా రాష్ట్రంలో చిన్న పార్టీలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతున్నది. రాష్ట్రంలో ప్రజా సమస్యలు నిరుద్యోగం,ధరల పెరుగుదల ,మహిళా భద్రతా పట్ల బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.

రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన కుషినగర్‌ ‌విమానాశ్రయం,సుల్తాన్‌ ‌పుర లోని పూర్వాంచల్‌ ఎక్స్ ‌ప్రెస్‌ ‌రహదారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభోత్సవానికి జన సేకరణ ఆదిత్యనాథ్‌ ‌కు తలకు మించిన భారమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు ఆసక్తి చూపలేదు. బలవంతపు జనసమీకరణ,తరలింపు తీవ్ర విమర్శలకు దారి తీసింది. అదే సమయంలో ప్రధాన స్రవంతి మీడియా సమాజ్‌ ‌వాది పార్టీ నేత అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌కార్యక్రమాలకు ప్రజలు హాజరు కావడాన్ని ప్రముఖంగా ప్రసారం చేయడం బీజేపీ ని ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రజా సమస్యల పై ప్రతి పక్షాలు పోరాటం ఉధృతం చేయడం రాష్ట్రం లో అధికారం లో ఉన్న బీజీపీ ని ఇబ్బందుల్లోకి నెట్టే అంశమే…! అగ్రకులానికి చెందిన గ్యాంగ్‌ ‌స్టర్‌ ‌వికాస్‌ ‌దూబే ఎన్‌కౌంటర్‌, ‌హత్రాస్‌ ‌సామూహిక అత్యాచారం..

ఆ తరువాత దళిత బాలిక హత్య ,ఈ మధ్య లఖిమ్‌ ‌పుర్‌ ‌లో నిరసన తెలుపుతున్న రైతుల పైకి అధికార పార్టీ మంత్రి వాహనం దూసుకు పోయిన ఘటన ఉత్తర ప్రదేశ్‌ ‌రాష్ట్రంలో బీజేపీ కి ప్రతికూల అంశాలే..! ఈ అంశాలను ప్రతిపక్షాలు ప్రధానంగా ఎన్నికల సందర్భంగా విస్తృత స్థాయిలో చర్చకు తీసుకు రావడం ..ప్రజల ముందు కు తీసుకురావడం సహజం ..! ఇటువంటి ప్రతికూల పరిస్థితిలో ఎన్నికల సమయంలో రైతాంగాన్ని ప్రసన్నం చేసుకోవడానికే వ్యవసాయ చట్టాల రద్దు తెరపైకి వొచ్చిందన్నది సుస్పష్టం ..కారణం వొచ్చే సంవత్సరం ఉత్తర ప్రదేశ్‌ ‌లో జరగ బోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 లోక్‌ ‌సభ ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి.

Leave a Reply