- దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలలో ఉత్తర ప్రదేశ్ ప్రధమ స్థానం
- రెండు మూడు స్థానాల్లలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర…
- అత్యత్ప నేరాలు మిజోరాంలో..
- 2019 సంవత్సరానికి తెలంగాణలో 18394… ఏపీలో 17746 కేసులు.
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ: దేశవ్యాప్తంగా మహిళలపై నమోదైన నేరాల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పాలిత ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉన్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. గత మూడు సంవత్సరాల నుంచి అత్యధికంగా ఈ రాష్ట్రంలోనే మహిళలపై దాడులు, నేరాలు జరుగుతున్నట్టు కేంద్ర గణాంకాలు స్పష్టం చేశాయి. మూడేండ్లుగా మహిళలపై జరరుగుతున్న నేరాలు ఏమాత్ర తగ్గుముఖం పట్టడం లేదని ప్రభుత్వ లెక్కలు ఘోషిస్తున్నాయి. 2019 సంవత్సరానికే ఆ రాష్ట్రంలో సుమారు 59,853 నమోదు కాగా అక్కడ కేసులు నిర్ధారితమైనవి కేవలం 8,059 అని కేంద్ర హోమ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
2017లో 56,011, 2018లో 59445 మహిళలకి సంబంధించిన విషయంలో యూపీలో కేసులు నమోదు అయ్యాయి. 2019లో అత్యత్పం ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో నమోదు అయినట్టు కేంద్ర హోమ్ శాఖ స్పష్టం చేసింది. దేశంలో మహిళలపై ఏ రాష్ట్రంలలో ఎక్కువ దాడులు,కేసులు నమోద అయ్యాయో పూర్తి వివరాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) ఎంపీ బికాస్ రంజన్ భట్టాచార్య అడిగిన ప్రశ్నకి కేంద్ర హోంశాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ఈ మేరకు బుధవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
కాగా రెండో స్థానంలో 41550 కేసులతో రాజస్థాన్ ఉన్నట్టు చెప్పారు. మూడు స్థానంలో మహరాష్ట్రలో 37,144 కేసులు నమోదు అయినట్టు వెల్లడించారు.ఇదే సమయంలో మహిళలపై నమోదైన నేరాల్లో 2019 సంవత్సరానికి తెలంగాణలో 18394… ఏపీ 17746 కేసులు ఉన్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.