Take a fresh look at your lifestyle.

కల్నల్‌ ‌సంతోష్‌కుమార్‌కు ఉత్తమ్‌ ‌నివాళి

తల్లిదండ్రులకు పరామర్శ..సోనియా లేఖ అందచేత
భారత్‌, ‌చైనా సైనికుల ఘర్షణలో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ కల్నల్‌ ‌సంతోష్‌బాబుకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంతాపం తెలుపుతూ లేఖ రాశారు. ఆ లేఖను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి డియా సమావేశంలో చదవిన అనంతరం సంతోష్‌బాబు తల్లిదండ్రులకు అందజేశారు. అలాగే రాహుల్‌ ‌గాంధీ కూడా సంతోష్‌బాబు మృతిపట్ల సంతాపం తెలిపారని చెప్పారు. కాంగ్రెస్‌ ‌తరఫున తాము సంతాపం తెలుపుతున్నామని ఉత్తమ్‌ ‌చెప్పారు. సంతోష్‌బాబు కుటుంబానికి కాంగ్రెస్‌ ‌పార్టీ అండగా ఉంటుందని, అన్నివిధాల సహాయ సహకారం అందిస్తామన్నారు. తెలంగాణ బిడ్డగా రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన సంతోష్‌బాబు పేరు ద ప్రభుత్వం ప్రాజెక్టు ఉంటే బాగుంటుందని. ఆయన పేరు ప్రతిష్టలు ఎల్లకాలం ఉంటాయని ఉత్తమ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. సంతోష్‌బాబు జీవితం పిల్లలకు ఆదర్శం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సూర్యాపేటలో ఏర్పాటు చేయబోతున్న ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీగానీ, ఏదైన ఇనిస్టిట్యూట్‌కైనా సంతోష్‌బాబు పేరు పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉత్తమ్‌ ‌సూచించారు. తెలంగాణకు ముద్దుబిడ్డ అన్నారు. ఆయన పేరు చిరస్థాయిగా నిలవాలన్నారు.

Leave a Reply