Take a fresh look at your lifestyle.

యుద్ధ విమానాలు నడపడం కంటే పార్టీ ని నడపడం కష్టం…ఉత్తమ్

ప్రజాతంత్ర ,హైదరాబాద్ : సంక్లిష్ట సమయంలో పీసీసీ గా బాధ్యతలు తీసుకున్నానని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు .ఐదేళ్లు అవకాశం ఇచ్చిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు థాంక్స్ తెలియచేశారు.ఉత్తమ్ నివాసం లో ఒక మీడియా తో మాట్లాడుతూ… .పార్టీలో నాయకులు అంతా బాగా సహకరించారని యుద్ధ విమానాలు నడపడం కంటే పార్టీ ని నడపడం కష్టమన్నారు . సైన్యంలో క్రమశిక్షణ ఉంటుంది కానీ రాజకీయాల్లో ఉండదని అన్నారు. ఒక్క తెలంగాణలోనే కాదు దేశం అంతా పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉందని అందుకే ఎన్నికల్లో ఓటమిపాలయ్యామన్నారు .

పార్టీలో భిన్న అభిప్రాయాలు వస్తూ ఉంటాయి వాటిని కూడా గౌరవించాలని తెలంగాణ లో కరోనా కేసులపై మాకు అనుమానం ఉందన్నారు .తక్కువ టెస్టులు చేసి తక్కువ కేసులున్నాయని చెప్పడం సరికాదన్నారు .కరోనా లేని తెలంగాణ కావాలని మాక్కూడా ఉంటుందని కానీ టెస్టులు చేయకుండా కరోనా లేదనడం సరికాదని విమర్శించారు .రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తడిసిన ధాన్యం కి మద్దతు ధర ఇవ్వాలని ,బత్తాయి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు .

Leave a Reply