- గ్రేటర్ ఎన్నికల ఫలితాల కు బాధ్యత వహిస్తూ రాజీనామా
- వరస ఓటములతో ఉత్తమ్ అసంతృప్తి
టీపీసీసీ అధ్యక్ష పదవికి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ కి పంపించనున్న ఉత్తమ్.. శుక్రవారం సాయంత్రం జీహెచ్ ఎంసీ ఎన్నికల ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా లేఖ ను విడుదల చేశారు.నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలని లేఖలో పేర్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి .జీహెచ్ ఎంసీ ఎన్నికలతో పాటు ఇటీవలే జరిగిన అన్ని ఎన్నికలో వరుస ఓటములతో అసంతృప్తి చెందారు.ఇప్పటికే పీసీసీ గా తన టర్మ్ ముగిసిన ఏఐసీసీ ఉత్తమ్ నే కొనసాగిస్తూ వచ్చింది.గతంలోనే ఏఐసీసీ కి నా రాజీనామా ఇవ్వడం జరిగింది ఇప్పుడు నా రాజీనామా ను ఆమోదించండి అని కోరిన ఉత్తమ్.దీనికి తోడు నూతన పీసీసీ ఎన్నిక కూడా త్వరలో జరుగనున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మొత్తానికి జీహెచ్ ఎంసీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ ని తీవ్రంగా నిరాశపరిచాయి.మరి ఉత్తమ్ రాజీనామాను అధిష్టానం ఆమోదించి నూతన అధ్యక్షుడి ఎంపిక ఎప్పటి వరకు పూర్తి చేస్తుందో చూడాలి.