Take a fresh look at your lifestyle.

ఉన్నత విద్య ప్రైవేటీకరణకు ఆజ్యం పోస్తున్న టిఆర్‌ఎస్‌

దుష్ట పాలకుడి బినామిగా ‘పల్లా’ : కాంగ్రెస్‌
రాష్ట్రంలో సాగుతున్న దుష్ట పాలనకు, విద్యా ప్రైవేటీకరణకు బినామిగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డిని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిని విద్యావంతులు చిత్తుగా ఓడించాలని రాష్ట్ర పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.  వరంగల్‌, ‌ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఈ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీగా నిలిపిన రాములునాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని శనివారం కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు వి. హనుమంతురావు,  మాజీ మంత్రి దుదిళ్ళ శ్రీధర్‌బాబు, జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి ఆయన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణ ఏర్పడిన తరువాత ఉన్నత విద్యను ప్రైవేటీకరించాలనే దుర్భుదితో ప్రైవేటీ విశ్వవిద్యాలయాలను తీసుకొవచ్చిందని, విద్యా ప్రైవేటీకరణకు ఆధ్యుడిగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇప్పుడు వరంగల్‌ ‌పట్టభద్రుల ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నిలిచి దుష్ట పాలనకు బినామిగా అవతరించాడని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుత విశ్వవిద్యాలయాలకు రెండు సంవత్సరాలుగా విసిలు లేరని, అలాగే అధ్యాపక, బోధనేతర సిబ్బంది ఖాళీలు ఏర్పడి విశ్వవిద్యాలయాలను విచ్ఛినం చేసి ప్రైవేట్‌ ‌విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం పూనుకుందని, దానికి సూత్రదారే ప్రస్తుత టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

తెలంగాణ ఏర్పడిన తరువాత ఎన్నో ఆశలతో ఉన్న ఇక్కడి విద్యావంతులు, నిరుద్యోగులు బలి పశువులయ్యారని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పిఆర్‌సి కమిటీ రాష్ట్రంలో 1.90లక్షల   ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడేళ్ళలో రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగి సుమారు 30లక్షలకు చేరుకున్నట్లు పలు అచనాలు సుచిస్తున్నట్లు ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని, ఉదోగ్యాల భర్తీ, నిరుద్యోగ భృతి, విశ్వవిద్యాలయాల బలోపేతం, తదితర అంశాలను మరిచిపోయి ఉద్యోగాలేవంటూ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రకటనలు చేయడం శోచనీయమన్నారు.

 

రాష్ట్రంలో భూ కబ్జాలు, హత్యలు, దోపిడీ విపరీతంగా పెరిగిందన్నారు. ప్రస్తుత నాయకులు వీటికి బినామీలుగా ఉంటూ ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీకి అభ్యర్థితత్వాన్ని ఏ పార్టీ ఇవ్వలేదని, తమ పార్టీ మొదటిసారిగా పట్టభద్రుల నియోజకవర్గానికి ఎస్టీ అభ్యర్థిని నిలిపి తమ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని, ఇక అతనిని గెలిపించడం ఈ ప్రాంత పట్టభద్రుల కర్తవ్యమన్నారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే గత రెండు సంవత్సరాల బకాయిలతో పాటు రూ.3116ల నిరుద్యోగ భృతిని అందిస్తామని ఉత్తమ్‌ ‌హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఇచ్చిన హామీలను బిజెపి ప్రభుత్వం నెరవేర్చకపోగా తెలంగాణ ప్రాంత ప్రజల సెంటిమెంట్‌ అయిన భదాద్రి భూములను ఆంధ్రకు ఇచ్చి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిందన్నారు. అలాగే కోచ్‌ ‌ఫ్యాక్టరీ, ఐసిఎంఆర్‌ ‌తదితర హామీలను నెరవేర్చని బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసిన కాకతీయ విశ్వవిద్యాలయ పట్టభద్రులు, విద్యార్థులు, ఈ ప్రాంత యువకులు కాంగ్రెస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులను కలిసిన వారిలో మాజీ మేయర్‌ ఎ‌ర్రబెల్లి స్వర్ణ, తెలంగాణ ఉత్తర జిల్లాల కో-ఆర్డి నేటర్‌ ఇనగాల వెంకట్రాం రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్‌, ‌టిపిసిసి సభ్యులు ఈవి శ్రీనివాస్‌ ‌రావు, టిపిసిసి కార్యదర్శులు మీసాల ప్రకాష్‌, ‌టిపిసిసి ఆర్గనైజింగ్‌ ‌సెక్రటరీలు, దుబ్బా శ్రీనివాస్‌, ‌టిపిసిసి అధికార ప్రతినిధి కూచన రవళి, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు పోశాల పద్మ, జిల్లా ఎస్‌సి డిపార్టుమెంటు చైర్మన్‌ ‌డాక్టర్‌ ‌రామకృష్ణ, వరంగల్‌ ‌మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు బంక సరళ, వరంగల్‌ ‌వెస్ట్ ‌బ్లాక్‌ ‌కాంగ్రెస్‌ అద్యక్షుడు బంక సంపత్‌ ‌యాదవ్‌, ‌గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కందికొండ చిన్న రాజు యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌జిల్లా ఉపాధ్యక్షుడు అలువాల కార్తిక్‌, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లకొండ సతీష్‌, ‌డివిజన్‌ అద్యక్షులు, వరంగల్‌ ‌పార్లమెంట్‌ ‌యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌కార్యదర్శి మహమ్మద్‌ ‌ముస్తాక్‌ ‌నేహళ్‌, ‌జిల్లా మరియు నగర కాంగ్రెస్‌ ‌నాయకులు జిల్లా మరియు నగర అనుబంధ సంఘాల అద్యక్ష కార్యదర్శులు, పలువురు జిల్లా నాయకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply