Take a fresh look at your lifestyle.

తెలంగాణకు ఇచ్చింది శూన్యం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కేంద్రం బ‌డ్జెట్ పై టీఆర్ఎస్ ఎంపీలు నిమ్మకు నీరెత్తి మౌనం వహించగా కేంద్ర బ‌డ్జెట్‌లో తెలంగాణకు ఇచ్చింది శూన్యం అని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్రం ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొత్త రాష్ట్ర‌మైన తెలంగాణకు కేటాయింపులు శూన్యమని టీ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.కేంద్ర బ‌డ్జెట్ కేటాయింపుల‌పై ఆయ‌న‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ప్రస్తుత బడ్జెట్ త్వరలో ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాలకు ల‌బ్ధి చేకూరే విధంగా మోడీ బడ్జెట్ ఉందని విమర్శించారు. దేశ ప్రజలందరికి సమానంగా అందాల్సిన  మూడు లక్షల కోట్ల రూపాయల సొమ్మును కేవలం కొన్ని రాష్ట్రాలకే పంచడం ఘోరం  ఎంపీ ఉత్తమ్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్  బడ్జెట్ ప్ర‌సంగం అనంతరం  ఢిల్లీలోని విజ‌య్ చౌక్ వ‌ద్ద‌ మీడియాతో వుత్తం కుమార్ మాట్లాడారు.

- Advertisement -

ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు కేంద్రం తన బడ్జెట్ ను వాడుకుంది అని అన్నారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలను కేంద్ర ఏ మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజీ కింద ఆరోగ్యానికి ప్రతియేటా రూ. 10 వేల కోట్లు ఏ మూలన సరిపోవన్నారు. ఇంకా ప్రభుత్వం ఉండేది మూడేండ్లే కాగా ఆరేండ్లకి ప్యాకేజీ పెట్టడం హాస్యాస్ప‌దం అన్నారు. డీజీల్, పెట్రోలో ధరలను పెంచడం దారుణమన్నారు. బడ్జెట్ ప్రసంగంలో వరి, పప్పు ధాన్యాలు కొనుగోలుపై యూపీఏ 2 ను విమర్శిస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రి కొన్ని లెక్కలు చెప్పారన్నారు.
ఇదే సందర్భంలో పెరిగిన ఆత్మహత్యలపై కూడా వివరణ ఇచ్చివుంటే బండారం బయట పాడేది అన్నారు. ఖాజీపేట రైల్వే కోచ్, బయ్యారం స్టీల్ ప్లాంట్, ట్రైబల్ యూనివర్సిటీ, ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పై సభలో ప్రశ్నిస్తామన్నారు. దాంతోపాటు, ఎంపీ ల్యాడ్స్ ను వెంటనే పున: రుద్దరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను మతపరంగా విభజించాలనే దురుద్దేశంతో బీజేపీ  ముందుకుపోతుందన్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు కేంద్రం ఒక్క మంచి పని తలపెట్టడం లేదన్నారు.

Leave a Reply