Take a fresh look at your lifestyle.

ఎన్నికలయ్యేదాకనే ఉత్తమ్‌ ‌దుబ్బాకలో ఉంటాడు

*మేమెప్పుడూ ఇక్కడే ఉంటాం
*వాన కాలంలో ఉసిళ్లొచ్చినట్లు బిజెపి, కాంగ్రెస్‌ ‌నేతలు వస్తుంటారు
*కాంగ్రెస్‌, ‌బిజెపి నేతల కుట్రలను యువత తిప్పికొట్టాలి
*దౌల్తాబాద్‌ ‌సదస్సులో మంత్రి హరీష్‌రావు పిలుపు

ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. ప్రశ్నలు సంధించారు. పిసిసి చీఫ్‌  ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఒక  స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఎన్నికలయ్యేదాకా దుబ్బాకలోనే ఉంటానని చెప్పాడు.  ఎన్నికల తర్వాత దుబ్బాకలో ఉంటాడా? కానీ,ఎన్నికలున్నా, లేకున్నా  దుబ్బాకలో ఉండేటోళ్లం ఎమ్మెల్సీ ఫారూఖ్‌ ‌హుస్సేన్‌, ఎం‌పీ ప్రభాకర్‌ ‌రెడ్డి, హరీష్‌ ‌రావు  ఉంటాడు. సుజాత అక్క ఎమ్మెల్యే గా అందరికి అందుబాటులో ఉంటుంది. కాంగ్రెస్‌ ‌నేతలు, బిజెపి నేతలు ఎన్నికలకు ముందుగానే దుబ్బాకను విడిచి వెళ్తారన్నారు. గురువారం సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్‌లో జరిగిన ఉప ఎన్నిక సదస్సులో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. వాన కాలంలో ఉసిళ్ళు వచ్చినట్టు కాంగ్రెస్‌, ‌బిజెపి నేతలు వస్తూ పోతూ ఉంటారనీ, ఇదంతా వోట్ల మందమేననీ అన్నారు. ఎన్నికల తర్వాత హైదరాబాద్‌ ‌పోయారంటే మళ్లీ దుబ్బాక ఏంటో పూర్తిగా మర్చిపోతారన్నారు.  ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి  మంత్రిగా పని చేసినప్పుడు  ఏరోజైనా దుబ్బాకకు వచ్చావా? ఏమైనా చూసావా?అని ప్రశ్నించారు.  ఉత్తంకుమార్‌ ‌రెడ్డి దౌల్తాబాద్‌ ‌చౌరస్తాలో నిలబడి రాయపోల్‌ ‌పోదామంటే డ్రైవర్‌ ‌లేకుండా వెళ్లగలడా?అని అడిగారు.

దుబ్బాక ఉద్యమాల గడ్డ పోరాటాల గడ్డ అని,  స్వరాష్ట్రం కోసం ఎక్కువ పోరాటం చేసింది దుబ్బాక ప్రజలేననీ అన్నారు. సిఎం కేసిఆర్‌ ‌నాయకత్వంలో రామలింగారెడ్డి దుబ్బాక ప్రజలకు ఇంటింటికీ త్రాగునీరు అందించారనీ,  ప్రతి ఇంటి నీటి బిందెలో కేసీఆర్‌, ‌రామలింగన్న ముఖమే కనిపిస్తుందన్నారు.  ఏ అక్కని అడిగినా, ఏ చెల్లిని అడిగినా  రామలింగన్న చేసిన అభివృద్ధి గురించి చెబుతారన్నారు.  దుబ్బాక నియోజక వర్గంలో లింగన్న 21 కొత్త సబ్‌ ‌స్టేషన్లు  నిర్మించారనీ, రైతుల కోసం వెయ్యి విద్యుత్‌ ‌ట్రాన్స్‌ఫార్మర్లు ఇచ్చారన్నారు. సబ్‌ ‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మార్ల వల్ల ఇప్పుడు బాయిల కాడ మోటర్లు కాలిపోతాలేవు, బోర్ల మోటార్లు పాడు అయితలేవన్నారు.  కాంగ్రెస్‌ ‌హయాంలో బీడీలు చేసే చెల్లెమ్మలకు ఒక్క రూపాయి ఇచ్చారా?అన్నారు. కానీ, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వ హయాంలో   దుబ్బాకలో బీడీలు చేసే చెల్లెమ్మలకు 20 వేల మందికి పెన్షన్లు ఇచ్చామన్నారు. – రామలింగన్న నాయకత్వంలో రాయపోలు కొత్త మండలంగా చేశారన్నారు. ప్రతి తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారనీ, కాంగ్రెస్‌, ‌బిజెపి నేతలేమైనా  ఒక్కటైన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేశారా?అని నిలదీశారు.  వోట్ల కోసం గ్రామాలకు వచ్చే బిజెపి, కాంగ్రెస్‌ ‌నేతలను యవకులు, విద్యార్థులు గట్టిగా తిప్పికొట్టాలన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో  గెలుపుపై ఎవరికీ డౌట్‌ ‌లేదు .గెలుపు ఎవరిది అంటే కారు గుర్తు సీఎం కేసీఆర్‌ ‌సార్‌ ‌నాయకత్వం వైపే ప్రజలు నమ్మకంగా ఉన్నారన్నారు.  ఒక కుటుంబం ఆపదలో దుఃఖంలో ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నిలబెట్టుకుంటోందనీ,  ఆ కుటుంబానికి టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అండగా ఉంటుందన్నారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  సుజాత అక్క ఎవరికీ కొత్త కాదు. ప్రతి పండుగలో,ప్రతి ఆపదలో ,ప్రతి ఎన్నికల్లోనూ ప్రతి ఇంటికి ప్రతి గడప తిరిగారన్నారు.  ప్రతి కార్యకర్తకు తెలిసిన వ్యక్తి సుజాత అక్కను భారీ మెజారిటీ గెలిపించుకుందామనీ హరీష్‌రావు పిలుపునిచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply