
ఖమ్మం నగరంలోని ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం సంయుక్తంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూ లించాలని కోరుతూ చేపట్టిన ర్యాలీని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సర్దార్‌పటేల్ స్టేడియం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఖమ్మం నుండి జమలాపురం వరకు నిర్వహించే ఈ ర్యాలీలో విద్యార్దులు,నగర ప్రజలు, విద్యార్దినీవిద్యార్దులు, విద్యా వేత్తలు,సామాజికవేత్తలు, పర్యావరణ వేత్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను శాశ్వతంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ప్లాస్టిక్ రహిత జిలాగా మార్చేందుకు చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరు సహకరించాల న్నారు. సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్‌ను నిర్మూలించాలని ప్రభుత్వం కూడా బావిస్తోంది. సింగిల్ యూసేజ్ప్లాస్టిక్ వల్ల రాబోయే తరాలకు పెద్ద ముప్పు వాటిల్లబోతోందని, అందుకే దీనిపై ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. క్యారీబ్యాగ్‌ల రూపంలో ఈ సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ ఎక్కువ శాతం బయటకు వస్తుందని. దానికి ప్రత్యామ్నాయంగా పేపర్ క్యారీబ్యాగ్స్, జ్యూట్ క్యారీబ్యాగ్స్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకరాగలి గితే సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకం తగ్గిపోతుంద న్నారు.
దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ గతంలోనే కరపత్రాలను విడుదల చేసి ప్రచారం చేయడం జరిగిందన్నారు. ఇంకా ముందుకు వెళ్లేందుకు ఖమ్మం నుండి జమలాపురం వరకు పాదయాత్రగా ఈ అవగాహన కార్యక్రమాన్ని తీసుకెళ్లేం దుకు వారు పూనుకున్నారని, ఈ కార్యక్రమం తీసుకున్నం దుకు వారికి అభినందనలని చెప్పారు. ప్రజల బాగస్వామ్యం లేకుండా వారికి అవగాహన కల్గించకుం డా ఏ కార్యక్రమం విజయం సాధించలేదన్నారు. ప్రతిరోజు ఖమ్మం పట్టణంలో 5 టన్నుల చెత్తను జనరేట్ చేస్తున్నామని, ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెరగబోతోందని చెప్పారు. ప్రతిరోజు మున్సిపాలిటి తీసే చెత్తలో ఎక్కువ శాతం సింగిల్ యూజ్ప్లాస్టిక్ కనిపిస్తోందని చెప్పారు. కూడళ్ల వద్ద ఏర్పాటుచేసిన పెద్ద డస్ట్‌బిన్ లలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లే ఎక్కువ శాతం ఉంటాయన్నారు. దీనికి ఏదో ఒక ప్రత్యామ్నాయం తీసుకరాకపోతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మట్టిలో కలవటానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే చెపుతున్నారన్నారు. దీనిని మనంగా మనం గమనంలోకి తీసుకోకపోతే ఇబ్బంది పడతామన్నారు. ప్యాకింగ్ మెటీరియల్స్‌లో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వుందని దీనిని కూడా పట్టించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేన్ అధ్యక్షులు వై వెంకటేశ్వరరావు, భాగం హేమంతరావు, చేకూరి కాశయ్య పాల్గొన్నారు.
Tags: use plastics,eliminated,NRI Parents,Minister Puvvada Ajay Kumar