Take a fresh look at your lifestyle.

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎగుమతికి అంగీకారం కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టీకరణ

ప్రాణాంతక కరోనా వైరస్‌ ‌తో అల్లాడుతున్న దేశాలకు అత్యవసరమైన మందులను సరఫరా చేస్తామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. మహమ్మారిని కట్టడి చేయడంలో సత్ఫలితాలు అందిస్తున్న పారాసిటమోల్‌, ‌హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎగుమతి చేస్తామని పేర్కొంది. ఇప్పటికే ఈ మందులను సరఫరా చేయాలన ఇఅమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌భారత్‌ను కోరారు. ఈ విషయం కూడా కేంద్రం పరిశీలనలో ఉంది. ఈ దశలో మందులసరఫా చేసే విషయంలో  భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీ‌వాస్తవ ఓ ప్రకటన విడుదల చేశారు. అంటువ్యాధి ప్రబలుతున్న తరుణంలో మానవతా దృక్పథంతో పారాసిటమోల్‌, ‌హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ‌మాత్రలను మన శక్తిసామర్థ్యాలపై ఆధారపడిన పొరుగు దేశాలకు సరఫరా చేయాలని నిర్ణయించాం. నిర్దిష్ట స్థాయిలో ఎగుమతి చేస్తాం. కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశాలకు కూడా సహాయం అందిస్తామని, ఇందులో రాజకీయాలకు ఎటువంటి తావులేదన్నారు.

 

విపత్కర పరిస్థితుల్లో భారత్‌ అం‌తర్జాతీయ సమాజానికి సంఘీభావం తెలుపుతోంది. అన్ని దేశాలు పరస్పర సహాయసహకారాలు అందించుకోవాలని పేర్కొన్నారు. కాగా కరోనాను కట్టడి చేయడం కోసం ఉపయోగి స్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతులపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సహాయం కోరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌.. ఒకవేళ భారత్‌ ‌తమకు సహకరించనట్లయితే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. వాణిజ్య పరంగా తమ నుంచి అనేక ప్రయోజనాలు పొందిన భారత్‌తో సత్పంబంధాలు కొనసాగుతాయని ఆశిస్తున్నానని సోమవారం నాటి సమావేశంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తొలుత మందుల సరఫరాకు ససేమిరా అన్న భారత్‌.. ‌మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy