Take a fresh look at your lifestyle.

పట్టణ ప్రగతి యజ్ఞంలా సాగాలి: పట్టణ ప్రగతిలో మంత్రి సత్యవతి రాథోడ్‌ ఎం‌పీ కవిత

Urban Satyagraha Yagna Yagna Urban Poetry Minister Satyavati Rathod MP kavitha

పట్టణ ప్రగతి కార్యక్రమా న్ని యజ్ఞంలా చేపట్టి పురపాలికలను సంపూర్ణంగా అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రా థోడ్‌ ‌పేర్కొన్నారు. సోమవారం మహబూబాబా ద్‌ ‌పట్టణంలోని 11వార్డు గోపాలపురంలో వార్డ్ ‌కౌన్సిలర్‌ ‌బాలు నాయక్‌ అధ్యక్షతన జరిగిన పట్ట ణ ప్రగతి ప్రారంభ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పార్లమెంట్‌ ‌సభ్యురాలు మాలోతు కవిత, జిల్లా కలెక్టర్‌ ‌వి పి గౌతమ్‌, ‌శాసనసభ్యులు శంకర్‌ ‌నాయక్‌ ‌తో కలిసి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రెండు దఫాలు చేపట్టి విజయవం తంగా పూర్తి చేసుకున్నామని అదే స్ఫూర్తి తో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని 15 రోజులపాటు చేపట్టి పట్టణాలను సమగ్ర అభివృద్ధి చేసుకోవాల న్నారు. వార్డుల సమస్యలను తెలుసుకొని పరిష్క రించడానికి అధికారులే నేరుగా వార్డులో తిరుగు తారని వార్డ్ అభివృద్ధి కమిటీలు వేసుకొని . అబ్బివృద్ధి చేసుకుందామన్నారు. మహాబుబాబాద్‌ ‌మునిసిపాలిటీకి 50 కోట్ల రూపాయలు మంజూరై నాయని, త్వరితంగా పనులు పూర్తి చేయాలని అధికకారులను ఆదేశించారు.

సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యం:
సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా కమిటీ వేసామని, అక్షర యజ్ఞంలో భాగస్వాములై నిరక్ష రాసులందరిని అక్షరాస్యులు చేయలని ఆన్నారు. నిజాము చెరువును గతంలో మినీ టాంక్స్ ‌బండ్‌ ‌గా అభివృద్ధి చేసుకున్నాం, చెరువు కొంత భూమిని కొందరు ఆక్రమించుకొన్నారని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకొని చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆన్నారు.పట్టణ కమిటీ ఏర్పాటు చేసి వారి సూచనలు, సలహాలతో పట్టనాన్ని అభివృద్ధి చేసుకొంటామని అన్నారు. కలెక్టరేట్‌ ‌కాంప్లెక్స్కునిర్మాణానికి కావలసిన అదనంగా నిధులు మంజూరుకి కృషి చేస్తానని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ‌వి.పి.గౌతమ్‌ ‌మాట్లాడుతూ 10 రోజుల్లో పల్లె ప్రగతి కార్యక్రమం లాగా పట్టణ ప్రగతిని చేపట్టి వార్డులో తిరిగి శానిటేషన్‌, ‌మంచినీటి, పరంగా వార్డ్ ‌మొత్తం స్కాన్‌ ‌చేసి ప్రాణిలిక రూపొందించాలి అన్నారు.

నేటి నుండి10 రోజుల పాటు ఉదయం 7 నుండి 11 గంటల వరకు వార్డ్ ‌ప్రత్యేక అధికారులు కౌన్సిలర్లతో కలసి వార్డులో తిరిగి సమస్యలు గుర్తించి మొదట ప్రజల అవసరాలు తీర్చాలని తెలిపారు. దానికనుగుణంగా అధికారులు స్థానిక కౌన్సిలర్‌, ‌ప్రతి వార్డులో 4 వార్డ్ ‌కమిటీలు యువజన, మహిళ, సీనియర్‌ ‌సిటిజన్‌, ‌ప్రముఖ వ్యక్తులతో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిం దన్నారు. ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ 10 రోజులు పట్టణ ప్రగతి కార్యక్రమంను పండు గలాగా చేపట్టి వార్డులను, కాలనీలను అభివృ ద్ధి చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌పాల్వాయి రామ్‌ ‌మోహన్‌ ‌రెడ్డి వైస్‌ ‌చైర్మన్‌ ‌ఫరీద్‌ ‌వార్డ్ ‌కౌన్సిలర్‌ ‌బాలు నాయాక్‌ ‌నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply