అందరి భాగస్వామ్యంతోనే పట్టణ ప్రగతి విజయవంతం : కలెక్టర్

హన్మకొండ,: అందరి భాగస్వామ్యంతోనే పట్టణ ప్రగతి విజయవంతం అవుతుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డివిజన్ 26లో మేయర్ గుండా ప్రకాష్‌రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పల్లెప్రగతి స్ఫూర్తిగా పట్టణ ప్రగతి కార్యక్రమం శ్రీకారం చేశారని పట్టణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు పచ్చదనం పరిశుభ్రత పాటించాలన్నారు. పట్టణ ప్రగతిలో మౌళిక సదుపాయాలు కల్పించేందుకు 10రోజుల పాటు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రాధాన్యత గల పనులను గుర్తించి ప్రణాళికన• తయారు చేస్తారని చెప్పారు.
ఈ కార్యక్రమానికి ప్రజల సహకారం ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం అవసరం ఉంటుందని అన్నారు. క్షేత్ర స్థాయిలో పనుల గుర్తింపే కాకుండా పారిశుధ్యం పచ్చదనం పై దృష్టి సారించాలని చెప్పారు. రాష్ట్ర ముఖ్యంత్రి ఆశించిన విధంగా వరంగల్ మహానగరాన్ని తీర్చిదిద్దాలని అందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. మేయర్ గుండా ప్రకాష్ రావు మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో మౌలిక సదుపాయాలకు ప్రణాళికను తయారు చేసామని ముఖ్యంగా పట్టణంను పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. పట్టణ ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం 7 కోట్ల 34 లక్షల రూపాయలను మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఓల్డ్ బీట్ బజారులో మురుగు నీరు రోడ్డు పైకి రాకుండా చర్యలు తీసుకుంటానని బట్టల బజార్లో కూడా డ్రైనేజీ ఓపెన్‌గా ఉండడం మూలంగా వ్యాపారస్తులు ఇష్ట ప్రకారంగా ముసేయడం వలన ఇరుకుగా మారిందని చెప్పారు. వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో జేసి దయానంద్, మునిపల్ యస్ఈ భాస్కర్ రెడ్డి, ఈఈ, ఏంయెచ్ఓ, వరంగల్ తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Urban Prosperity, Successful, Collector Prakash Rao