Take a fresh look at your lifestyle.

సమస్యల పరిష్కారానికే పట్టణ ప్రగతి మంత్రి సత్యవతి రాథోడ్‌

Urban progress towards solving problems Minister Satyavati Rathod

హన్మకొండ: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని త్వరితగతిన పరిష్కరించడానికే సిఎం కెసిఆర్‌ ‌పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. గురువారం వరంగల్‌ ‌పశ్చిమ నియోజకవర్గంలోని 30, 36, 57వ డివిజన్‌లలో పట్టణ ప్రగతిలో మంత్రి సత్యవతి రాథోడ్‌, ‌ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌ ‌వినయ్‌భాస్కర్‌, ఎం‌పీ పసునూరి దయాకర్‌, ‌మేయర్‌ ‌గుండా ప్రకాష్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల భాగసౌమ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మహిళలకు ఉపాధి కల్పించేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్‌ ‌సమస్యలను పరిష్కరించేందుకు కరెంటు పోల్స్ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, కమ్యూనిటి హల్‌, ‌కూరగాయల వ్యాపారుల కోసం ప్రత్యేకంగా మార్కెట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పట్టణ ప్రగతికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని, దృష్టికి వచ్చిన సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ పది రోజుల్లో పూర్తి కానీ సమస్యలు ఏవైనా ఉంటే ప్రణాళికా బద్ధంగా పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు.

ప్రజాక్షేత్రంలో ఉంటాం.. సమస్యలు పరిష్కరిస్తాం : ఛీఫ్‌ ‌విప్‌
ఎన్నికలున్నా లేకున్నా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌ ‌దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. పట్టణాల రూపురేఖలు మార్చేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. పారిశుద్ధ్యం, వీధి దీపాలు, గుంతలు లేని రహదారులు, పచ్చదనం, క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌ ‌జిమ్‌, ‌స్మశాన వాటికల నిర్మాణం పట్టణ పరిధిలో భాగంగా పూర్తి చేయాలని, పనులు సమీక్షించేందుకై ప్రతి డివిజన్‌కి స్పెషల్‌ ఆఫీసర్ల్ ‌నియమించడం జరిగిందన్నారు. ప్రజలకు తగిన మౌలిక వసతులు కల్పించి తద్వారా సుపరిపాలన అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌లక్ష్యమన్నారు. ప్లాస్టిక్‌ ‌రహిత నగరంగా వరంగల్‌ ‌నగరాన్ని తీర్చిదిద్దాలని, ఇండ్లపై నుండి వెళ్తున్న విద్యుత్‌ ‌లైన్లను రోడ్డు మధ్యలో ఉన్న కరెంటు స్తంభాలు గుర్తించి విద్యుత్‌ ‌శాఖ ఆధ్వర్యంలో తక్షణమే వాటిని పునరుద్ధరణ చేస్తున్నామన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఐదుగురికి దాదాపు ఆరు లక్షల 80 వేల రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అందించడం జరిగిందన్నారు. పెద్దమ్మగడ్డలో అర్బన్‌ ‌హెల్త్ ‌సెంటర్‌ ‌ప్రారంభించారు. జ్యోతిబసు నగర్‌ ‌లో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ అబూబకర్‌, ‌జక్కుల వెంకటేశ్వర్లు, బోడా డిన్న, అధికారులు, ప్రజాప్రతినిధులు, డివిజన్‌ అధ్యక్షులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

error: Content is protected !!