Take a fresh look at your lifestyle.

నిరంతర ప్రక్రియలాగా పట్టణ ప్రగతి

పట్టణ ప్రగతిలో ప్రజల, ప్రజాప్రతినిధులు సహకారం అభినందనీయమని అందరి సహకారంతో పట్టణ ప్రగతి పురోగతిలో కొనసాగుతోందని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ ‌జి.రవి అన్నారు. బుధవారం పట్టణంలోని 25 వార్డులో పట్టణ ప్రగతిలో బాగంగా చెత్త సేకరణ వాహనాలను, చెత్తడబ్బాల పంపిణి కార్యక్రమాలలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, ‌మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌శ్రావణిలతో కలిసి పాల్గోన్నారు. ఈసందర్బంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో చేపట్టే పనుల కోసం ప్రతి నెలా జిల్లాకు రెండు కోట్ల 29 లక్షల నిధులు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియలా కొనసాగించేందుకు ప్రజలందరు సహాకరించాలన్నారు. జగిత్యాల జిల్లాలో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు చేపట్టిన సర్వేలో 14 వేల 150 మంది నిరక్షరాస్యులను గుర్తించడం జరిగిందన్నారు. వీరందరిని అక్షరాస్యులుగా మార్చే కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనున్నామని చెప్పారు. వచ్చే జూన్‌, ‌జులై మాసాలలో ప్రతి ఇంటికి మొక్కలను పంపిణి చేయడం జరుగుతుందని అయా మొక్కలను పెంచి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల సహకారం మున్సిపాలిటికి అవసరమన్నారు. పట్టణంలోని వ్యాపారులు వారి షాపులలో మిగిలిన తడి పొడి చెత్తలను వేరువేరుగా వేసి మున్సిపాలిటి వారికి అందించాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోను రోడ్డుపైన చెత్తవేయరాదని, డ్రైనేజిలలోను వేస్తే చట్టరిత్యాల చర్యలు తప్పవని కలెక్టర్‌ ‌హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ‌మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణాలో సిఎం కేసిఆర్‌ ‌పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో ప్రవేశపెట్టారన్నారు. పల్లెలు, పట్టణాలు అభివృద్దిలోకి చేరి పచ్చని పల్లెలు, పట్టణాలుగా మారినపుడే అభివృద్ది చెందినట్టన్నారు.

జగిత్యాల మున్సిపాలిటికి 91 లక్షలు వచ్చాయని ఈసందర్బంగా చెప్పారు. ప్రతి ఇంటిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే కోరారు. మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌శ్రావణి మాట్లాడుతూ పదిరోజుల పట్టణ ప్రగతిలో జగిత్యాలలోని 48 వార్డులలో అధికారులు, కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులతో పర్యటించి వార్డులలోని సమస్యలను తెలుసుకొని తాత్కాలికమైనవి పరిష్కరించడం జరిగిందన్నారు. మిగిలిపోయిన పనులను ప్రణాళిక ప్రకారం చేపట్టి శాశ్వత పరిష్కారం చూపుతామని దీనికి ప్రజల సహకారం అవసరమన్నారు. మున్సిపాలిటిలోని రోజువారి చెత్తను సేకరించడానికి 12 కొత్త అటోలు వచ్చాయని వాటిలో తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించడం జరగుతుందన్నారు. అదేమాదిరిగా 66 వేల చెత్త బుట్టలు వచ్చాయని ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలను ఇస్తున్నట్లు వీటిని అయా వార్డులలోనే అందిస్తామని చైర్మన్‌ ‌తెలిపారు. ఈకార్యక్రమములో అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌బి. రాజేశం, మున్సిపల్‌ ‌కమీషనర్‌ ‌జయంత్‌రెడ్డి, మున్సిపల్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ శ్రీ‌నివాస్‌, ‌వార్డు కౌన్సిలర్‌ అనుమల్ల కృష్ణహారితోపాటు వివిధ వార్డుల కౌన్సిలర్లు, అధికారులు, ప్రజలు ఉన్నారు.

Leave a Reply