Take a fresh look at your lifestyle.

ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి భూ అక్రమణలకు అధికారుల అండ

ఈ వ్యవహారంపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరపాలి: ప్రభాకర్‌
ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌ ‌రెడ్డి భూ ఆక్రమణకు పాల్పడినా పోలీసులు ముందుగా కేసు రిజిష్టర్‌ ‌చేయలేదని  బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ‌ప్రభాకర్‌ ఆరోపించారు. అధికార పార్టీ అండతోనే ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌ ‌రెడ్డి భూ ఆక్రమణకు పాల్పడ్డారన్నారు.  ఈ వ్యవహారంపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ ‌చేసవారు. మంగళవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ..అడ్డుకునే వారెవరూలేరనే ధీమాతోనే ఇలా టీఆర్‌ఎస్‌ ‌లీడర్లు రెచ్చిపోతున్నారన్నారు. ఉప్పల్‌ ఎమ్మెల్యేకు అనుకూలంగా పోలీసులు వ్యవరించారని.. కేసు నమోదు చేయాలని కోర్టు చెప్పినా పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. పిటిషన్‌ ‌దారుడు మరోసారి కోర్టుకు వెళ్తే హైకోర్ట్ ఆదేశాల ప్రకారం కేసు నమోదు అయ్యిందన్నారు. వెంటనే పోలీసులు ఎమ్మెల్యే సుభాష్‌ ‌రెడ్డి, ఎమ్మార్వో గౌతం కుమార్‌ను అరెస్ట్ ‌చేయాలని డిమాండ్‌ ‌చేశారు. కేసు నీరుగార్చకుండా చూడాలన్న ప్రభాకర్‌.. ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభాష్‌ ‌రెడ్డికి సిఎంవోలో ఉన్నతాధికారుల సహకారం ఉందని తెలిపారు. అందుకే భూ కబ్జాలకు పాల్పడుతున్నారని..

సిఎంవో  నుంచే డైరెక్షన్‌ ‌నడుస్తుందని చెప్పారు. అందుకే కోర్టు నెల రోజుల కిందే అదేశాలు ఇచ్చినా ఇంకా కేసు నమోదు కాలేదన్నారు. టీఆర్‌ఎస్‌ ‌పాలన మొత్తం కూడా అవినీతి పాలన అయ్యిందని..ఇదే చివరి కాలమన్నారు. మళ్లీ  ప్రభుత్వం రాదని తెలిసే ప్రజా ప్రతినిదులు దోచుకోవడం మొదలుపెట్టారన్నారు. ఉప్పల్‌ ఎమ్మెల్యే భూ ఆక్రమణపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ చేపట్టాలని ప్రభాకర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply