గరిడేపల్లి, ఏప్రిల్ 27(ప్రజాతంత్ర విలేకరి) : మండ లంలోని కోదండరాంపురం గ్రామంలో సోమవారం •పాధి హామీ పనులు ప్రారంభించారు. ఈ సందర్భం గా సర్పంచ్ వెన్న రవీందర్రెడ్డి మాట్లాడుతూ •పాధి హామీ పనులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో •పసర్పంచ్ రమేశ్, పంచాయతీ కార్యదర్శి అంజయ్య,టిఎహారిక, కూలీలు పాల్గొన్నారు.
ఉపాధి పనులు పరిశీలన:
మండలంలోని పొనుగోడు గ్రామంలో జరుగుతున్న •పాధి హామీ పనులను ఎంపిడివో వనజ సోమవారం పరిశీలించారు. •పాధి హామీ పనులకు వస్తున్న ప్రతి కూలీ సామాజికదూరం పాటిస్తూ పనులు జాగ్రత్తగా చేసుకోవాలన్నారు. తప్పనిసరిగా మాస్క్లు ధరించాలన్నారు. వేసవి దృష్ట్యా కూలీలకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జోగు సరోజిని పిచ్చిరెడ్డి, కార్యదర్శి ఇ.సైదులు, ఎంపిటిసి-2 మేళ్లచెర్వు వెంకటరమణ పాల్గొన్నారు.