- టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
- పోతిరెడ్డిపాడుతో దక్షిణ తెలంగాణకు సున్నం
- మండిపడ్డ మాజీమంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి
పోతిరెడ్డిపాడు విస్తరణ ఆగే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి పోతిరెడ్డిపాడు పైన పవర్ పాయింట్ పర్సెంటేషన్ ఇచ్చారని అన్నారు. సోమవారం గాంధీభవన్ లో పోతిరెడ్డిపాడు విస్తరణకు వ్యతిరేక పోరాట కమిటీ సమావేశమైంది .ఈ సమావేశం పోతిరెడ్డిపాడు చైర్మన్ నాగం జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది .ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, మాజీ మంత్రి ప్రసాద్, మాజీ ఎంపీ మల్లు రవి, విహెచ్ పలువురు డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ….తెలంగాణ ఉద్యమంలో సాగునీరు పోరాటం జరిగిందన్నారు .పోతిరెడ్డి పాడు విస్తరణ జరిగినప్పుడు కేసీఆర్ కేంద్ర మంత్రిగా, రాష్ట్రంలో 6 గురు టిఆర్ఎస్ మంత్రులు ఉన్నారని గుర్తు చేశారు.విస్తరణ సమయంలో ఇప్పుడు కీలకంగా ఉన్న వాళ్ళు అప్పుడు లేరని కానీ కేసీఆర్ స్వయంగా మంత్రిగా ఉన్నారని అప్పుడు కిమ్మనలేదని విమర్శించారు.
- పోతిరెడ్డిపాడుతో దక్షిణ తెలంగాణకు సున్నం
- జగన్‌తో కెసిఆర్ రహస్య ఒప్పందం మేరకే నీటి తరలింపు
- మండిపడ్డ మాజీమంత్రి నాగం జనార్ధన్ రెడ్డి
పోతిరెడ్డిపాడు విస్తరణతో దక్షిణ తెలంగాణకు భారీగా నష్టం జరుగుతుందని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. కేసీఆర్, జగన్‌లు సమావేశం అయ్యాక కూడా జగన్ సంగమేశ్వర్ ప్రాజెక్టుకు జీఓ ఇచ్చి, 170 టీఎంసీల నీరు ఏపీకి తరలించారన్నారు. నెల్లూరులో రెండు పంటలు పండించుకున్నారని.. మూడో పంటకు సిద్ధం అవుతున్నారని తెలిపారు. కృష్ణ నుంచి పెన్నా బేసినకు తరలిస్తున్నారని.. మనకు 69 శాతం కృష్ణాలో హక్కు ఉందన్న నాగం జనార్దన్ రెడ్డి, తక్షణం పోతిరెడ్డిపాడును ఆపాలన్నారు. 12 వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ తెచ్చుకుంటే.. కేసీఆర్ జగన్‌తో చీకటి ఒప్పందాలు చేసుకొని మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ కు పంపులు, మోటార్లు, ఇంజనీర్, డిజైన్ తప్ప ఏ తెలియదని.. కృష్ణ నీళ్లు దోచుకుపోతే గోదావరి నీటిని ఎత్తిపోసి కమిషన్లు దోచుకోవలని చూస్తున్నారు. కృష్ణాలో నికర జలాలు కూడా తెలంగాణ వాడుకోలేదని.. కృష్ణానది కమిటీ అన్ని గ్రామాలు తిరుగుతుందని.. కేసీఆర్ లోపాయకారి ఒప్పందాలను బయటపెట్టి రైతుల పక్షాన పోరాడుతామని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. రైతుల పక్షాన పోరాడుతుంటే కెసిఆర్ ఎదురుదాడి చేస్తున్ఆనరే తప్ప దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
బీటెక్, డిగ్రీ పరీక్షలు కూడా నిర్వహించకుండ ప్రోమోట్ చేయాలి…ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్
ప్రజాతంత్ర : బీటెక్ ,డిగ్రీ పరీక్షల నిర్వహణ పై హై కోర్ట్ ని ఆశ్రయించింది రాష్ట్ర ఎన్ఎస్యూఐ.రిట్ పిటిషన్ నెంబర్ WP(PIL) No 128/2020….బీటెక్,డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించకుండా అందరిని ప్రమోట్ చేయాలని రాష్ట్ర ఎన్ ఎస్‌యూఐ అధ్యక్షుడు బలమురి వెంకట్ హై కోర్ట్ ని ఆశ్రయించారు.ఈ మేరకు సోమవారం హై కోర్ట్ లో ఈ పిటిషన్ పై వాదనలు జరిగాయి.ఒకవైపు రాష్ట్రంలో కారోనో విజ్రంభిస్తుంటే పరీక్షలు నిర్వహించడం సరికాదని ఈ సమయంలో పరీక్షలు నిర్వహిస్తే కారోనో మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొంది .10 ష్ట్ర క్లాస్ పరీక్షల విషయంలో హై కోర్ట్ హైద్రాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్ లో పరీక్షలు నిర్వహించకూడదని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ ,మరి జే ఎన్టీయూ కాలేజ్ లు ఎక్కువ ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి ఎలా పరీక్షలు నిర్వహిస్తారని తెలిపింది. 10th క్లాస్ వాళ్ళని ప్రమోట్ చేసిన్నట్లే బీటెక్,డిగ్రీ విద్యార్థులను ఈ సెమిస్టర్ వరకు ప్రమోట్ చేయాలని కోరింది.ప్రభుత్వం ఈ పరీక్షలకు సంబంధించి తీసుకున్న చర్యలు ఏంటో కౌంటర్ దాఖలు చేయాలని కోర్ట్ కోరింద.