Take a fresh look at your lifestyle.

జూన్‌ 8 ‌వరకు… ధాన్యం కొనుగోళ్లు

రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను జూన్‌ 8 ‌వరకు కొనసాగించ నున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రకటించారు. మొదట మే 31 వరకే కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే పలు ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జూన్‌ 8 ‌వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వర్షాలు రాకముందే రైతులు పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ ఇంకా పూర్తి కాలేదని, అనేక గ్రామాల్లో ధాన్యం సేకరించి ఉందని వార్తలు వచ్చాయి. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం రికార్డుస్థాయిలో ధాన్యం సేకరణ చేసింది. దేశ వ్యాప్తంగా యాసంగి సీజన్‌ ‌ధాన్యం సేకరణలో తెలంగాణ నంబర్‌వన్‌ ‌స్థానంలో ఉందని భారత ఆహార సంస్థ ప్రకటించింది. దేశం మొత్తం ద ఈ సీజన్‌లో 83.01 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల మేర ధాన్యం సేకరణ జరగ్గా, ఒక్క తెలంగాణ సొంతంగా 52.23 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యాన్ని సేకరించి సరికొత్త రికార్డులు సృష్టించిందని తెలిపింది. ఇప్పటికే తెలంగాణ్థ 91.07 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా సగానికి పైగా సేకరణపూర్తి చేసిందని వెల్లడించింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌ ‌సైతం రికార్డు స్థాయిలో 23.04లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించిందని పేర్కొంది. ఈ మేరకు భారత ఆహార సంస్థ సీఎండీ వి.వి.ప్రసాద్‌ ‌పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత లాక్‌డౌన్‌ ‌పరిస్థితుల దృష్ట్యా, కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పౌరసరఫరాల ఛైర్మన్‌ ‌మారెడ్డి శ్రీనివాస రెడ్డి తెలిపారు. కరోనా లాక్‌డౌన్‌ ‌పరిస్థితుల్లోనూ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటూ ధాన్యం కొనుగోళ్లను కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీస్తున్నారు. సిద్దిపేట జిల్లా మొత్తంలో 7లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. పలు గ్రామాల్లో అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి, రైతులకు, కేంద్రం నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply