కరోనా వైరస్ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన సందర్భంగా అనవసరంగా రోడ్లపై తిరిగితే చర్యలు తప్పవని కోదాడ రూరల్ సిఐ శివరాంరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు లాక్డౌన్ సందర్భంగా షాపులను తెరిచి ఉంచిన, మాస్క్‌లు లేకుండా బయట తిరిగినా లాక్డౌన్ ఉల్లంఘించిన 128మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు. అలాగే 519వాహనాలు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా రూరల్ సర్కిల్ పరిధిలో అనుకొని ఉన్న రాష్ట్ర సరిహద్దులు విజయవాడ నుండి హైదరాబాద్‌కు వెళ్లే 65వ జాతీయ రహదారిపై రామాపురం క్రాస్ రోడ్డు నల్లబండ గూడెం వద్ద చెక్‌పోస్టును ఏర్పాటుచేసి నిరంతరం డిసిటివి కెమోరాలతో పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
అంతేకాకుండా రామపురం గ్రామం, ఉగ్గమందారం, పులిచింత ప్రాజెక్టు వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. అలాగే అక్కడ కూడా సిసిటివి కెమోరాలతో తనిఖీలు చేస్తూ ప్రతి చెక్‌పోస్టు వద్ద భారీకేట్లను ఏర్పాటుచేసిన రాకపోకలను నిషేధిస్తున్నామని అన్నారు. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి వచ్చి లాక్డౌన్ నిబంధనలను ఉల్లఘించిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు ఇది గమనించి ఏవరూ రోడ్లపైకి రావొద్దని కోరారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా వ్యాధి నివారణకు తోడ్పాడాలన్నారు.