Take a fresh look at your lifestyle.

అన్‌లాక్‌ 3 ‌మార్గదర్శకాలు వెల్లడించిన కేంద్రం

  • ఆగస్టు 5 నుంచి యోగా కేంద్రాలు, జిమ్‌లకు అనుమతి
  • 31 వరకు విద్యా సంస్థలు, మెట్రో రైళ్లు, సినిమా థియేటర్లు బంద్‌

దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ 3 ‌కి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఈమేరకు కేంద్ర హోం శాఖ పది మార్గదర్శకాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న కంటైన్మెంట్‌ ‌జోన్లలో ఆగస్టు 31 వరకూ లాక్‌డౌన్‌ ఆం‌క్షలను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. అయితే, కంటైన్మెంట్‌ ‌ప్రాంతాలు మినహాయించి కొంత ఊరట చెందే విధంగా సడలింపులను ప్రకటించింది. ఇందులో భాగంగా రాత్రి వేళల్లో ఇప్పటి వరకూ అమలులో ఉన్న కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు 5నుంచి దేశవ్యాప్తంగా ఉన్న యోగా కేంద్రాలు, జిమ్‌లను తెరిచేందుకు అనుమతించింది.

ఆగస్టు 31 వరకూ  పాఠశాలలు, విద్యా సంస్థలు, కోచింగ్‌ ‌సెంటర్లు మూసే ఉంటాయని తెలిపింది. వందే భారత్‌ ‌మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులకు పరిమిత సంఖ్యలో నడుపుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు నడిపేందుకు, సినిమా థియేటర్లు తెరిచేందుకు, అనుమతి లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా స్విమ్మింగ్‌ ‌పూల్స్, ‌పార్కులు, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్, ‌సామాజిక, రాజకీయ, క్రీడా వినోద, విద్యా, సాంస్క•తిక, మతపరమైన సభలు, కార్యక్రమాలకు అనుమతి లేదని పేర్కొంది. అయితే, నిబంధనలు సడలించిన రంగాలలో కోవిడ్‌ ‌వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ప్రజలు భౌతిక దూరంతో పాటు మాస్కు ధరించడం,ఇతరత్రా ఆరోగ్య సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.

Leave a Reply