కొరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి చర్యలు
అమరావతి,జులై 3 : ఏపీలో కరోనా నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా కరోనా నివారణచర్యలు, అన్ లాక్ 2.0 కు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర మార్గ దర్శకాల మేరకు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. వైరస్ వ్యాప్తి నివారణ కోసం సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ నీలం సాహ్నీ ఆదేశాలు జారీచేశారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివిధ ఉత్తర్వుల మేరకు అన్‌లాక్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈనెల 31వ తేదీ వరకూ అన్ లాక్ 2.0 ను అమలు చేయాలని కేంద్రం సూచించింది. కోవిడ్ ఆర్డర్స్ 52, 53, 55 మేరకు రాష్ట్రంలోకి ప్రయాణికులను నియంత్రించాలని ఆదేశాలిచ్చింది. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పోలీసులు, కమిషనర్లు, ఎస్పీలు, డిఎం హెచ్ఓలు, మున్సిపల్ కమిషనర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డిఓలు,ఎంఆర్ఓలు, ఎంపీడీవోలకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆదేశాలిచ్చారు.?కంటైన్ మెంట్ జోన్లలో నిబంధనలు అమలు చేయాలి.
జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కషనర్లు కంటైన్ మెంట్ జోన్ల విషయంలో అప్రమత్తంగా వుండాలి. అన్‌లాక్ 2 ప్రకారం విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, జిమ్ లు, మెట్రో రైలు సర్వీసులు మరో నెల రోజుల పాటు మూసివేసే ఉంటాయి. కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షల్ని కఠినంగా అమలు చేయాల్సి ఉంటుంది. హోం ఐసోలేషన్ మార్గదర్శకాలివే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ..హాస్పిటల్స్‌లో చేరకుండా ఇంటి వద్దే ఉండి ట్రీట్మెంట్ పొందేందుకు అనుసరించాల్సిన విధివిధానాలను ఏపీ సర్కార్ ఖరారు చేసింది. ఈ మేరకు హోం ఐసోలేషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది.? ఇంట్లో ఉన్నప్పుడు ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా…వెంటనే టోల్‌ఫ్రీ (0866-2410978) నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే టోల్‌ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి మెడికల్ హెల్ప్ పొందవచ్చు.?రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు ఆహారంలో బ్రౌన్‌రైస్, గోధుమలు, చిరుధాన్యాలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.ఏపీలో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు పెంచింది. దీంతో కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఏపీలో కొత్తగా 837 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 9 మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో 16,934కి చేరాయి కరోనా కేసులు. ఇప్పటి వరకు 206కరోనా మరణాలు. ఏపీలో 9,096 యాక్టివ్ కేసులు ఉండగా, 7,632 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.