Take a fresh look at your lifestyle.

అద్వితీయ బాలీవుడ్‌ ‌నటనా చక్రవర్తి దిలీప్‌ ‌కుమార్‌

(‌వెండి తెర లెజెండరీ నటుడు ‘ట్రాజెడీ కింగ్‌’ ‌దిలీప్‌ ‌కుమార్‌ ‌తుది శ్వాస విడిచిన వేళ అక్షరాంజలి)
హిందీ సినీ వినీలాకాశంలో వెలిగిన దృవతారగా మన ‘దిలీప్‌ ‌కుమార్‌’ ‌తన నటనా కౌశలంతో ఐదు దశాబ్దాలకు పైగా హిందీ సినీ అభిమానులను అలరించి, అందరి మనసులు దోచుకున్నారు. దిలీప్‌ ‌కుమార్‌ అసలు పేరు ‘మహమ్మద్‌? ‌యుసుఫ్‌ ‌ఖాన్‌’ అని మనకు తెలుసు. ‘ది ఫస్ట్ ‌ఖాన్‌’‌గా వెండి తెరపై అపూర్వ నటుడిగానే కాకుండా సినీ నిర్మాతగా, దాతృత్వం కలిగిన మానవీయ మూర్తిగా జీవించిన దిలీప్‌ ‌కుమార్‌ అనేక మాసాలుగా దీర్ఘకాలిక కాన్సర్‌, ‌కిడ్నీ వ్యాధులతో తన 98వ ఏట 07 జూలై 2021 ఉదయం 7:30 గంటలకు తుది శ్వాస విడవడం అత్యంత విచారకరం. 01 డిసెంబరు 1923న పాకిస్థాన్‌ ‌పెషావర్‌లో అయేషా బేగమ్‌ – ‌లాలా గులామ్‌ ‌సర్వర్‌ ‌ఖాన్‌ ‌దంపతులకు జన్మించిన మెహమ్మద్‌? ‌యుసుఫ్‌ ‌ఖాన్‌ 1944 ‌నుంచి 1998 వరకు నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించారు.

నాసిక్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. దిలీప్‌ ‌కుమార్‌ ‌బాల్యస్నేహితుడుగా రాజ్‌ ‌కపూర్‌తో హిందీ సినీ పరిశ్రమలో దిగ్గజ నటులుగా కూడా కొనసాగారు. పూనెలో సాండ్‌విచ్‌ ‌స్టాల్‌ను ప్రారంభించిన యుసుఫ్‌ ‌ఖాన్‌ ? 5000/- ‌సంపాదించి బొంబాయ్‌ ‌చేరారు. తన మిత్రుని సహకారంతో బొంబాయ్‌ ‌టాకీస్‌ ‌యజమాని దేవికా రాణితో పరిచయం ఏర్పడి నెలకు ? 1250/- జీతంతో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగ వృత్తిలో భాగంగా అగ్రనటుడు అశోక్‌ ‌కుమార్‌, ‌నిర్మాత శశిధర్‌ ‌ముఖర్జీలతో పరిచయం ఏర్పడింది. తన ఉర్దూ భాషానైపుణ్యంతో వీరిరువురుకి దగ్గరై కథ రచన, స్క్రీప్ట్ ‌విభాగంలో చేరారు. మహమ్మద్‌? ‌యుసుఫ్‌ ‌ఖాన్‌ ‌పేరును దిలీప్‌ ‌కుమార్‌గా మార్చిన దేవికా రాణి తొలి సినిమా ‘జ్వార్‌ ‌భాటా’తో బాలీవుడ్‌ ‌వెండి తెరకు పరిచయం అయ్యారు.

1944లో ‘జ్వార్‌ ‌బాటా’ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన దిలీప్‌ ‌కుమార్‌ 65 ‌సినిమాల్లో నటించి తన నటనా ప్రతిభను ప్రేక్షకులకు పరిచయం చేయడమే కాకుండా ఇతర నటులకు నటనారంగంలో మార్గదర్శిగా నిలిచారు. ‘జుగ్నూ’ (1947), ‘షహీద్‌?’ (1948), ‘‌మేల’ (1948), ‘అందాజ్‌’ (1949), ‘ఆన్‌’ (1952), ‘‌దాగ్‌‘ (1955), ‘ఆజాద్‌?’ (1955), ‘‌దేవదాస్‌’ (1955), ‘‌ముఘల్‌-ఈ-ఆజమ్‌’ (1960), ‘‌కోహినూర్‌’ (1960), ‘‌గంగా జమున‘ (1961), ‘లీడర్‌’ (1964), ‘‌రామ్‌ ఔర్‌ ‌శ్యామ్‌’ (1967), ‘‌గోపి‘ (1970), ‘దాస్థాన్‌’ (1972), ‘‌భైరాగ్‌’ (1976) ‌లాంటి అనేక బ్లాక్‌బస్టర్‌ ‌సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. 1976 -1981 మధ్య ఐదు సంవత్సరాలు విరామం తీసుకున్న దిలీప్‌ ‌కుమార్‌ అనంతరం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ‘క్రాంతి’ (1981), ‘శక్తి’ (1982), ‘విధాత’ (1982), ‘మషాల్‌’ (1984), ‘‌కర్మ‘ (1986), ‘సౌదాగర్‌’ (1991)‌లతో పాటు చివరి సినిమాగా ‘ఖిలా’ (1998)లో నటించి ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి, చూపరులను మంత్రముగ్దుల్ని చేశారు.

రెండవ దశలో అమితాబ్‌, ‌మనోజ్‌ ‌కుమార్‌, ‌శ్రీ కరూర్‌, ‌శమ్మీ కపూర్‌, ‌హేమామాలిని, శత్రుగన్‌ ‌సిన్హా, సంజీవ్‌ ‌కుమార్‌, ‌సంజయ్‌ ‌దత్‌, అనిల్‌ ‌కరూర్‌ ‌జితెంద్ర లాంటి అగ్ర హీరోలతో కలిసి నటించారు. దిలీప్‌ ‌కుమార్‌ ‌నటించిన మెఘల్‌-ఈ-ఆజమ్‌, ‌నయా దౌర్‌ ‌సినిమాలను 2004, 2008ల్లో ఈస్ట్‌మన్‌ ‌కలర్‌ ‌సినిమాలుగా మార్చి విడుదల చేయడం జరిగింది. మధుబాలతో ప్రేమలో పడినప్పటికి పెళ్ళి వరకు వెళ్ల లేదు. 1966లో సైరా భాను మరియు 1981లో రెండవ భార్యగా హైదరాబాద్‌?‌కు చెందిన ‘అసిమా సాహిబా’లను వివాహమాడారు. అసిమా సాహిబాతో 1983లో విడాకులు తీసుకొన్న సైరా భానుతో కలిసి ముంబాయ్‌లో స్థిరపడ్డారు. రాజ్‌కపూర్‌, ‌నర్గీస్‌, ‌నూర్జహాన్‌, ‌వైజయంతి మాల, మధుబాల, నిమ్మి, మీణా కుమారి, కామిని కౌషల్‌లతో పోటీగా నటించి మెప్పించగలిగారు. దిలీప్‌ ‌కుమార్‌ ‌నటించిన కొన్ని సినిమాలు తనకు ‘ట్రాజెడ కింగ్‌’‌గా పేరు తెచ్చాయి. 1950ల్లో దిపీప్‌ ‌కుమార్‌ ‌నటించిన 9 సినిమాలు అత్యధిక వసూళ్లు తెచ్చి పెట్టిన 30 సినిమాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 1950ల్లో ఒక సినిమాకు లక్ష రూపాయల డిమాండ్‌ ‌కలిగిన ఏకైక నటుడిగా దూసుకు పోయారు.

దిలీప్‌ ‌కుమార్‌ ‌జీవిత విశేషాలను ఉదయతార నాయర్‌కు వివరించగా ‘దిలీప్‌ ‌కుమార్‌ : ‌ది సబ్‌స్టాన్స్ అం‌డ్‌ ‌ది షాడో’ పేరుతో జీవిత చరిత్ర రచించబడింది. ఉర్దూ, హింది, పంజాబీ, మరాఠీ, ఇంగ్లీష్‌, ‌బెంగాలీ, గుజరాతీ, పార్శియన్‌, అవదీ, పాస్టో, హిడ్కో, భోజ్‌పురీ లాంటి భాషలు/యాసలు మాట్లాడగల దిలీప్‌ ‌కుమార్‌ ‌క్రికెట్‌ ‌క్రీడ మరియు సంగీతంలో అధిక అభిరుచి, మక్కువ చూపే వారు. సామాజిక స్పృహ కలిగిన దిలీప్‌ ‌కుమార్‌ ‌ప్రజల ఉల్లాసం కోసం ‘జగ్గర్స్ ‌పార్క్’, ‘ఓలివర్‌ ఆం‌డ్రాడ్‌’‌లను అభివృద్ధి చేశారు. దిలీప్‌ ‌కుమార్‌ ‌నటనకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ విభూషన్‌’ (2015), ‘‌పద్మ భూషన్‌’ (1991)‌లే కాకుండా పాకిస్థానీ ప్రభుత్వ ‘నిషాన్‌-ఈ-ఇం‌తియాజ్‌’ (1998) ‌గుర్తింపును పొందారు. ఏప్రిల్‌ 2000 ‌నుంచి ఏప్రిల్‌ 2006 ‌వరకు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. అత్యుత్తమ సినీ ఆవార్డు ‘దాదా సాహెబ్‌ ‌పాల్కే’ (1994) పురస్కారంతో పాటు అత్యధిక (08) ‘ఫిలిం ఫేర్‌ ఆవార్డుల విజేత’గా గిన్నీస్‌ ‌రికార్డు నెలకొల్పడం మరియు తొలి ఫిలిం ఫేర్‌ ఆవార్డు చేజిక్కించుకున్న దిలీప్‌ ‌కుమార్‌ ‌నిన్నటి తరానికి నటనను పరిచయం చేసిన ఘనుడు.

‘ఫిలిం ఫేర్‌ ‌జీవన సాఫల్య పురస్కారం’ (1993), ‘ప్రత్యేక ఫిలిం ఫేర్‌ ఆవార్డు’, ‘నేషనల్‌ ‌ఫిలిం ఆవార్డు’, బోస్టన్‌, ‌కర్లొవీ వారీ ‘అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌ ఆవార్డులు’, ‘షరీఫ్‌ ఆఫ్‌ ‌ముంబాయ్‌’ ‌ప్రభుత్వ గుర్తింపు, ‘యన్‌టిఆర్‌ ‌నేషనల్‌ ఆవార్డు’, ‘సియన్‌యన్‌-ఐబియన్‌ ‌జీవన సాఫల్య పురస్కారం’ (2009) లాంటి పలు పురస్కారాలు పొందారు. సంతానం లేకపోవడం కొంత నిరాశను కలిగించినా, దిలీప్‌ ‌కుమార్‌ ‌సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం నేటి నటులకు కాకుండా మనలాంటి సామాన్యులకు కూడా ప్రేరణ అవుతుందనటంలో అతిశయోక్తి లేదు. దిలీప్‌ ‌కుమార్‌ ‌భౌతికంగా మన ముందు లేకపోయినా, వారి సినిమాల ద్వారా మన అంతరంగంలో సుస్థిర స్థానం పొందారని, దివీప్‌ ‌కుమార్‌ ఆత్మకు శాంతి కలగాలని, వారి సతీమణి సైరా భానుకు ప్రగాఢ సానుభూతిని తెలియజేద్దాం.

burra-madhusudhan-reddy
– డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల
కరీంనగరం – 9949700037

Leave a Reply