Take a fresh look at your lifestyle.

కరోనా బారిన పడ్డ కేంద్రమంత్రి పోఖ్రియాల్‌

ట్విట్టర్‌ ‌ద్వారా వెల్లడించిన మంత్రి
దేశంలో  రెండో దశలో వేగంగా వ్యాప్తిస్తూ  ప్రకంపనలు రేపుతున్న  కరోనా వైరస్‌ ‌మహమ్మారి  రాజకీయ ప్రముఖుల్లో కలకలం రేపుతోంది. కోవిడ్‌-19 ‌పాజిటివ్‌ ‌నిర్దారణ అవుతున్న రాజకీయ నేతల జాబితా అంతకంతకే పెరుగుతోంది.  తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ ‌పోఖ్రియాల్‌ ‌నిషాంక్‌ ‌కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ‌ద్వారా వెల్లడించారు.  కరోనా నిర్దారణ పరీక్షల్లో తనకు పాజిటివ్‌గా తేలిందని తెలిపారు. వైద్యులు సూచనలమేరకు తాను చికిత్స తీసుకుంటానన్నారు. అలాగే ఇటీవలి కాలంలో తనను కలిసిన అధికారులు, సన్నిహతులు అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ ట్వీట్‌ ‌చేశారు. అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవడంతోపాటు, కొద్ది రోజులపాటు హోమ్‌ ‌క్వారెంటైన్‌లో ఉండాలని పోఖ్రియాల్‌ ‌సూచించారు. కాగా ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,  కేంద్ర, రాష్ట్ర మంత్రులు  కరోనా బారిన పడ్డారు. ఈ వారంలో  భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌కు, కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌గాంధీకి కరోనా వైరస్‌ ‌సోకిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో రోజు రోజుకు వైరస్‌ ‌కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు దాదాపు మూడు లక్షలకు చేరువలో ఉన్నాయి. అలాగే  మరణాల సంఖ్య తాజాగా రెండువేల మార్క్‌ను దాటడం మరింత ఆందళన రేపుతోంది.

Leave a Reply