Take a fresh look at your lifestyle.

ఎంఎం‌టిఎస్‌ ‌రైళ్లను ప్రారంభించండి సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ

‌కొరోనా నియంత్రణలో భాగంగా గత ఏడాది నిలిపివేసిన ఎంఎంటిఎస్‌ ‌రైళ్లను తిరిగి ప్రారంభించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఎంఎంటిఎస్‌ ‌రైళ్లను నిలిపివేయడం వల్ల హైదరాబాద్‌ ‌నగరంతో పాటు శివారు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈమేరకు కిషన్‌రెడ్డి సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.అతి తక్కువ చార్జీలతో వేగంగా, సౌకర్యవంతంగా గమ్య స్థానాలకు ప్రయాణికులను చేరవేసే ఎంఎంటిఎస్‌ ‌రైళ్లు ఇంకా ప్రారంభం కాకపోవడంతో వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారులు, ఎంఎంటిఎస్‌ ‌రైళ్లలో అతి తక్కువ చార్జీలకే ప్రయాణించే వారనీ, కొరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజలు కోవిడ్‌ ‌జాగ్రత్తలు తీసుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్న తరుణంలో ఎంఎంటిఆర్‌ ‌రైళ్లను వెంటనే నడపాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైల్వే శాఖను కోరాల్సిందిగా సీఎంకు సూచించారు. ముంబై నగరంలో లోకల్‌ ‌రైళ్లను అక్కడి ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ నడిపిస్తున్నదనీ, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కోవిడ్‌ ‌నిబంధనలు పాటిస్తూ ఎంఎంటిఎస్‌ ‌రైళ్లను నడిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని రైల్వే శాఖతో ఈ విషయంపై వెంటనే చర్చించాలని కిషన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply