Take a fresh look at your lifestyle.

వరదబాధితులను ఆదుకోవడంలో విఫలం

సహాయక చర్యల్లో గ్రేటర్‌ అధికారుల నిర్లక్ష్యం
కమిషనర్‌ ‌లోకేశ్‌కు కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఫోన్‌

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌వరద సహాయక చర్యల్లో జీహెచ్‌ఎం‌సీ అధికారులు విఫలమయ్యారని అంటూ కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి దుయ్యబట్టారు. జీహెచ్‌ఎం‌సీ కమిషనర్‌ ‌లోకేష్‌ ‌కుమార్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా తన దగ్గరకు జీహెచ్‌ఎం‌సీ అధికారు లను పంపకపోవడంపై సీరియస్‌ అయ్యారు.

ఈ మేరకు గురువారం ఆయన జీహెచ్‌ఎం‌సీ కమిషనర్‌ ‌లోకేష్‌ ‌కుమార్‌ ‌ఫోన్‌ ‌చేసి నిరసన వ్యక్తం చేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. నాలాపై పడ్డ చెట్లు, చెత్తను తొలగించకపోవడంతో జీహెచ్‌ఎం‌సీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో వేగం పెంచాలని ఆదేశించారు.

Leave a Reply