Take a fresh look at your lifestyle.

నియంత కెసిఆర్‌ను దించేందుకు కలసి రావాలి

  • నియంత కెసిఆర్‌ను దించేందుకు కలసి రావాలి
  • అందుకే పార్టీని బలోపేతం చేస్తున్నాం
  • ఈటెల చేరికను ధృవీకరించిన కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి

నియంత కేసీఆర్‌ను గద్దె దించటానికి అందరూ కలసి రావాలని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. నియంతృత్వ పాలనను ఎదుర్కోవటానికే పార్టీని బలోపేతం చేస్తున్నామని అన్నారు. ఈటల రాజేందర్‌ ‌ఢిల్లీలో జేపీ నడ్డాను కలుస్తారని అన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌బీజేపీలో చేరడంపై కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి స్పందించారు. నగరంలో సోమవారం వి•డియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ‌తనతో చర్చించిన తర్వాతే ఈటల ఢిల్లీ వెళ్ళారన్నారు. ఈటల చేరికను ముఖ్యనేతలతో సహా అందరూ స్వాగతిస్తున్నారని.. పార్టీలో సానుకూల వాతావరణం ఉందన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ సహకరించాలని కోరారు. అసంతృప్తులు సహజమని, సీనియర్‌ ‌నేత పెద్దిరెడ్డి అసంతృప్తిని పార్టీలో చర్చిస్తామన్నారు. అంతర్గత అంశాలు బయటకు చెప్పాల్సిన అవసరం లేదని, పెద్దిరెడ్డి తనను విమర్శించినంత మాత్రానా తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు.

కేసీఆర్‌కు మంచిని.. మోదీకి చెడును ఆపాదించటం టీఆర్‌ఎస్‌ ‌నేతలకు అలవాటుగా మారిందన్నారు. ఇదిలావుంటే మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌బీజేపీలో చేరతారని గతకొంత కాలంగా పుకార్లు వస్తున్నాయి. ఈటల ఢిల్లీకి వెళ్లడంతో వీటికి మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది. తనతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌తోనూ ఈటల మాట్లాడారని.. తర్వాతే ఢిల్లీకి పయనమయ్యారని కిషన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ ‌ప్లాంట్లు అవసరమైన మేరకు అందించాం.

పీఎం కేర్‌ ‌నుంచి 1,400 వెంటిలేటర్లు అందించాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా కొనుగోలు చేయలేదు. భారత్‌ ‌బయోటెక్‌, ‌సీరం కంపెనీలకు అడ్వాన్స్‌లు చెల్లించాం. కేంద్ర ప్రభుత్వం డిజాస్టర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌చట్టం ఉపయోగించి ఆక్సిజన్‌, ‌వ్యాక్సిన్‌లను అన్ని రాష్టాల్రకు అందుబాటులోకి తీసుకొచ్చింది. నేను ఓ ఎంపీగా సికింద్రాబాద్‌ ‌పార్లమెంట్‌ ‌పరిధిలో లక్షా 50 వేల కేజీల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నా’ అని కిషన్‌ ‌రెడ్డి వివరించారు.

Leave a Reply