Take a fresh look at your lifestyle.

షాడో సీఎంగా కేటీఆర్ ..!

  • ఏ అర్హత తో శాసిస్తునాడు
  • ప్రశ్నించిన కేంద్ర హోమ్ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: కేసీఆర్ కుటుంబాని వ‌న్నీ గాలి మాట‌లే అని మంత్రి కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఉక్కు ప‌రిశ్ర‌మ బాధ్య‌త‌ని ఏపీ స‌ర్కారు తీసుకుంటా అంటే కేంద్రం పరిశీలిస్తుంది అన్నారు. ఢిల్లీలో మీడియాతో కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.
రాష్ట్ర ముఖ్య‌మంత్రి త‌న‌యుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ‌కి  షాడో ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని శాసిస్తుంచ‌డం ఏంట‌ని కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి జీ కిషన్ రెడ్డి నిల‌దీశారు. అసలు ఏ ప్రాతిపదికన ఆయ‌న‌ రాష్ట్రాన్ని శాసిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు.  ఏ అధికారంతో అన్ని శాఖల మీద పెత్తనం చేస్తున్నారని?  అడిగారు. ఆదివారం ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.  చివరకు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మోడీ అమ్మేస్తారని అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కిష‌న్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ కుటుంబం, ఒవైసీ కుటుంబం తెలంగాణను కొనేసినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పక్క రాష్ట్రంలోని సమస్యలపై మాట్లాడే ముందు, రాష్ట్రంలోని బైంసా లో జరిగిన హింసాత్మక ఘటనలపై మాట్లాడాలని హితవు పలికారు.
అత్యాచారం జరిగిన చిన్నారి, మత ఘర్షణల్లో ఇబ్బంది పడుతున్న వారిని రక్షించాల్సింది పోయి… ఓట్లు పొందాలనే దుర్మార్గపు విధానాన్ని అవలంభించడం మంచికాదన్నారు. అభివృద్ధి తక్కువ, ఆర్భాటం ఎక్కువ అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పాలన తీరు ఉందన్నారు.  గోరంత చేసి కొండంత చూపించడం కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్యని మండిపడ్డారు. కేసీఆర్ మమతను ఆదర్శంగా తీసుకున్నారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నిచారు. ప‌శ్చిమ‌ బెంగాల్ సీఎం మమత బెన‌ర్జీని ఆదర్శంగా తీసుకొని, ఆమె అడుగు జాడల్లో కేసీఆర్ పాలన సాగిస్తున్నార్నారని విమర్శంచారు. టీఎంసీ సర్కార్ పై అక్కడి ప్రజల చేస్తోన్న తిరుగుబాటును కేసీఆర్ గుర్తుంచుకోవాలని సూచించారు. మమతా బంగ్లాదేశ్ వ్యక్తులకు, కేసీఆర్ ఎంఐఎం అండగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మజ్లిస్ నేతలు ఏం చెప్పినా… కేసీఆర్ ‘జీ హుజూర్’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లీస్ అండతోనే అన్ని సీట్లు సాధించామని టీఆరెస్ విశ్లేషించుకుందన్నారు. దీన్నిబట్టే రెండు పార్టీల మైత్రి ఏంటో తెలుస్తుందని అన్నారు.  నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన టీఆరెస్ పాలనలో ఇప్పుడు నిధులు లేవు, నియామకాలు లేవన్నారు.
విశ్వవిద్యాలయాల్లో ఏడేండ్లుగా  ఒక్క నియామకం జరగలేదని. ఉస్మానియాలో అనేక విభాగాలు అధ్యాపకులు లేక మూతపడేలా ఉన్నాయని చెప్పారు. ఒక్క పోస్ట్ ను  భర్తీ చేయక కుండా ఉస్మానియాపై టీఆర్ఎస్ క‌త్తిగట్టినట్టు వ్యవహరిస్తోందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం  భూసేకరణ చేపట్టి అప్పగిస్తే యుద్ధప్రాతిపదికన ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ఆయ‌న చెప్పారు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ బాధ్య‌త‌ని ఏపీ స‌ర్కారు తీసుకుంటే తాము ప‌రిశీలిస్తామ‌ని కేంద్ర హోంశాఖ మంత్రి కిష‌న్ రెడ్డి వెల్ల‌డించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్  ప్ర‌యివేటీక‌ర‌ణ నిర్ణయాన్ని తీసుకున్న కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక  ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు కొన‌సాగుతోన్న నేప‌థ్యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్ర ప్ర‌భుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. నష్టాల్లో కొన‌సాగుతోన్న విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను నడపడం ప్రభుత్వనికి భారమని అన్నారు. ఒక వేళ‌ స్టీల్‌ప్లాంట్ ను త‌మ ప‌రిధిలోకి తీసుకోవడానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం అవ‌స‌ర‌మైన ప్రతిపాద‌న‌ల‌తో ముందుకొస్తే ఆ విష‌యంపై కేంద్ర స‌ర్కారు ఆలోచిస్తుంద‌ని తెలిపారు. ఉక్కు ప‌రిశ్ర‌మ‌ల‌ కోసం ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హ‌క్కు ప్ర‌తి ఒక్క‌రికీ ఉంద‌ని చెప్పారు. ప్ర‌జాస్వామ్యయుతంగా ఆందోళ‌న చేస్తే తమ‌కేం అభ్యంత‌రం లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

Leave a Reply