Take a fresh look at your lifestyle.

కల్వకుంట్ల, ఓవైసి కుటుంబాల పాలన అంతానికి.. దుబ్బాక ప్రజలు నాంది పలుకనుండ్రు

తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన దుబ్బాక ప్రజలు అథికార తెరాసకు బుద్దిచెప్పెందుకు సిద్ధమైండ్రని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..దుబ్బాకలో నిశబ్ద విప్లవం ప్రారంభమైందని, గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వెలువడిన ఫలితాలు పునరావృతం కానున్నాయన్నారు. కల్వకుంట్ల, ఓవైసి కుటుంబల పాలనకు వ్యతిరేకంగా, దుబ్బాక ప్రజల తీర్పు రాష్ట్ర రాజకీయాలల్లో కీలక మార్పుకు నాంది పలుకబోతుందన్నారు. బిజెపి అభ్యర్థి ప్రజా గొంతుక రఘునందన్‌ ‌రావుకు అనుకులంగా వోటింగు సరళి ఉందబోతుందని జోష్యం పలికారు.

అధికార పార్టీ నాయకులు చేస్తున్న అధికార దుర్వినియోగం, కుట్రలు, అసత్య ప్రచారాలు, అనైతిక ప్రవర్తన చూసి తెరాసకు బుద్ధి చెప్పెందుకు ప్రజలు సిద్ధమైండ్రని తెలిపారు. అధికార పార్టీ నాయకుల తీరు చూస్తుంటే మేము, మాకుంటుంబం తప్ప వేరే వారు రాజకీయాలల్లో ఉండొద్దన్న విధంగా అధికార పార్టీ నాయకుల ప్రవర్తన ఉందన్నారు. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారంపై అసత్య ప్రచారలు చేస్తూ బిజెపిపై బురద జల్లె ప్రయత్నాలు చేస్తున్న తెరాసకు దుబ్బాక ప్రజల తీర్పు గుణపాఠం కానుందన్నారు. పేదల ప్రజలకు గృహ నిర్మాణం కోసం కేంద్రం సహకారం అందిస్తున్నప్పటికి ప్రజలకు చేరకుండా తెరాస నాయకుల రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం పేరిట కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply